married woman kidnapped by police officer's son in tamilnadu

Former lover kidnapped married woman in tamilnadu

tamilarasi, kidnap, satyanathan, former police officer rammoorthy, arasa kumaran, nagarapatti police station, krishnagiri district

married woman tamilarasi kidnapped by former police officer's rammoorthy son satyanathan alleges tamilarasi parents. police team alloated in search of satyanathan

వివాహిత కిడ్నాప్.. మాజీ ప్రియుడి పనేనా.? ఇద్దరి పథకమా..?

Posted: 04/28/2016 04:50 PM IST
Former lover kidnapped married woman in tamilnadu

తాను ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో తన తల్లిదండ్రులు వివాహం చేయడంతో ఆ వివాహితను బాధించిందా..? తాను ప్రేమించిన యువతికి తనను వంచించి మరో వ్యక్తితో వివాహం చేసుకోవడం ఆ ప్రేమికుడిలో పగను రగిల్చిందా..? లేక అదను కోసం చూను ప్రేమికులిద్దరూ కలసి ఈ వ్యూహం రచించారా..? ఇందులో ఎవరి ప్రమేయం ఎంత..? ఇద్దరు కలసి చేశారా..? లేక ఒక్కరి ప్రోద్భలంతోనే అంతా జరిగిందా..? లేక ఇద్దరు ముందుగా రచించుకున్న పథకం ప్రకారమే ఇలా జరిగిందా..? తమిళనాడులోని కష్ణగిరిలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసులో పోలీసుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. అచ్చంగా సినిమా కథను తలపించేలా సాగిన ఈ ఘటనపై వివాహిత తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు మాజీ ప్రేమికుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలో గల తలిపట్టి గ్రామానికి చెందిన అరస కుమరన్ (కూలీ)కి తమిళరసి(20) అనే కుమార్తె వుంది. బీఎస్సీ పూర్తి చేసిన తమిళరసికి ధర్మపురి జిల్లా పాలకోడు సమీపంలోని పొత్తలం గ్రామానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల దగ్గర బంధువు ఒకరు హఠాన్మరణం చెందడంతో ఆయన అంత్యక్రియలకు తమిళరసి హాజరైంది. అంతే.. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇంటికి రాలేదు. దాంతో తీవ్ర దిగ్ర్భాంతి చెందిన ఆమె బంధువులు ఊరంతా వెతికారు.

ఈ నేపథ్యంలో కొంతమంది తమిళరసిని పోలీస్ అధికారిక రామూర్తి కుమారుడు అయిన సత్యనాథన్ (23) కిడ్నాప్ చేసి వుండవచ్చునని తెలిపారు. దీంతో తమిళరసి తండ్రి అరస కుమరన్ నాగరసంపట్టి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తె తమిళరసిని పోలీసు అధికారి రామమూర్తి కుమారుడు సత్యనాథన్ కిడ్నాప్ చేశాడని, ఆమెను రక్షించాలని ఫిర్యాదులో కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామమూర్తి ఇంటికి వెళ్లి విచారణ జరపగా సత్యనాథన్ ఇంట్లో లేడని తెలిసింది.

అదే సమయంలో వారికో షాకింగ్ విషయం తెలిసింది. సత్యనాథన్, తమిళరసి గతంలో ప్రేమించుకున్నారని.. వీరి ప్రేమ వ్యవహారం తమిళరసి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆమెను వేరే వ్యక్తితో వివాహం జరిపించారని తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రేమించిన తమిళరసిని మరచిపోలేక సత్యనాథన్ ఆమెను కిడ్నాప్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అదృశ్యమైన సత్యనాథన్, తమిళరసిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles