కండోమ్ ప్యాకెట్లపై ఫోటోలపై కోర్టు ఏమందంటే.. | Supreme Court on Condom packets cover photos

Supreme court on condom packets cover photos

Condoms, Supreme Court, Add, Condom add photos, సుప్రీంకోర్టు, కండోమ్, నిరోధ్

One of India's most senior lawyers has been ordered to study condom and other contraceptive packets to determine if their pictures are too racy and should be banned, according to reports.Additional Solicitor General Maninder Singh must spend six weeks pouring over photographs -- often of scantily clad women or couples in steamy embraces

కండోమ్ ప్యాకెట్లపై ఫోటోలపై కోర్టు ఏమందంటే..

Posted: 04/28/2016 09:40 AM IST
Supreme court on condom packets cover photos

కండోమ్ ప్యాకెట్ల మీద, వాటికి సంబంధించిన ప్రకటనల్లో మహిళల అసభ్య ఫోటోలు ముద్రిస్తూ, అశ్లీలతతో కూడిన ప్రకటనలతో ప్రజలు చెడుతోవపడుతున్నారని సుప్రీం కోర్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రకటనల్లో అశ్లీలతపై పరిశీలన చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) మనీందర్ సింగ్‌ను అదేశించింది.

ఈ ప్రకటనలను నియంత్రించేందుకు మీ దగ్గర ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అని ఎఎస్‌జిని సుప్రీం ప్రశ్నించింది. ఆరు వారాల పాటు నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పాలని ఎఎస్‌జిని సుప్రీం ఆదేశించినట్లు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రకటనలను పరిశీలించిన తర్వాత ఆ మేరకు సూచనలు ఇవ్వాలని సుప్రీం పేర్కొంది. అయితే ఎఎస్‌జి మనీందర్ సింగ్ కార్యాలయం మాత్రం దీనిపై స్పందించేందుకు విముఖత ప్రదర్శించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles