Jaitley Shocks Jagan

Jaitley shocks jagan

jaitley, Jagan, Delhi, YS jagan, Chandrabababu, TDP, YSRCP, జగన్, జైట్లీ, ఏపి, టిడిపి

Central Finance Minister Arun Jaitley gave shock to YSRCP President YS Jagan.. Jagan complaints about AP CM Chandrbabu Naidu.

వైయస్ జగన్ షాకిచ్చిన జైట్లీ

Posted: 04/28/2016 11:41 AM IST
Jaitley shocks jagan

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైసీపీ అధినేత వైయస్ జగన్ కు షాకిచ్చారు. దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన జగన్ జైట్లీ అడిగిన ప్రశ్నతో ఖంగుతిన్నారట. చంద్రబాబు అవినీతిపై వేసిన ఎంప‌రర్ ఆఫ్ క‌ర‌ప్షన్ పుస్తకాన్ని కేంద్ర మంత్రులకు అందజేశారు. బాబు అవినీతి గురించి వివ‌రిస్తున్న జ‌గ‌న్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో అవినీతి సొమ్ముతో అధికార టీడీపీ త‌మ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని జ‌గ‌న్ బుధ‌వారం పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో అరుణ్‌జైట్లీకి ఫిర్యాదు చేశారు.

లోక్‌స‌భ‌లో వైకాపా ప‌క్షనేత మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డితో క‌లిసి జైట్లీని క‌లిసి జ‌గ‌న్ త‌మ ఎమ్మెల్యేల జంపింగ్ గురించి చెప్పగానే జైట్టీ జ‌గ‌న్‌తో ‘తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందనుకుంటా! అక్కడేమో టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు కదా’ అని వ్యాఖ్యానించారు. దీంతో జ‌గ‌న్ ఒక్క‌సారిగా షాక్ అయిన‌ట్టు స‌మాచారం.. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ర్టానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరానికి నిధులు ఇవ్వాలని కూడా జైట్లీని కోరానని జగన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaitley  Jagan  Delhi  YS jagan  Chandrabababu  TDP  YSRCP  జగన్  జైట్లీ  ఏపి  టిడిపి  

Other Articles