KCR told who is TRS Boss

Kcr told who is trs boss

TRS, Khammam, KCR, TRS Boss, Telangana, TRS Plenary, కేసీఆర్, టీఆర్ఎస్, టిఆర్ఎస్ ప్లీనరీ

Telangana CM and TRS President KCR reveals who is boss for Telangana Rastra Samithi party. He spoke at TRS plenary at Khammam.

TRSకు బాస్ ఎవరో చెప్పిన కేసీఆర్

Posted: 04/27/2016 01:33 PM IST
Kcr told who is trs boss

తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీని విజయపథంలో, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులు అని అన్నారు.  రాష్రం వచ్చినా ఎన్నో అవరోధాలు సృష్టించారని,  ఎన్నో బాలారిష్టాలు తట్టుకుని హిమాలయమంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం అని వెల్లడించారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు అపూర్వమైన మద్దతు ఇస్తున్నారని అన్నారు.  గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని చాటిచెప్పారని తెలిపారు.

వరంగల్ ఎంపీగా పసునూరి అధిక మెజారిటీతో గెలిపించడం అపూర్వఘట్టం అని కేసీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీలో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నామని పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు.  మనకు గర్వం పనికిరాదు, అపజయాన్ని చూసి కుంగిపోవద్దు. జయాన్ని చూసి పొంగిపోవద్దు అని హితవు పలికారు. గతం, భవిష్యత్తు మీదనే అందరూ దృష్టిసారించాలని అన్నారు. తెలంగాణ పునర్‌ నిర్మాణ మహాయజ్ఞంలో అందరం కార్యకర్తలమేనని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles