అమరావతికి ఆయన.. చంద్రబాబు స్కెచ్! | Chandrababu trying to bring that person to amaravathi

Chandrababu trying to bring that person to amaravathi

Chandrababu Naidu, JD laxminarayana, CBI LaxmiNarayana, AP, Amaravathi, Law and Order, అమరావతి, లా అండ్ ఆర్డర్, లక్ష్మీనారాయణ, చంద్రబాబు

AP CM Chandrababu Naidu may trying to invite former CBI JD Laxminarayana to Amaravathi. May he maintain Law and Order in Amaravathi.

అమరావతికి ఆయన.. చంద్రబాబు స్కెచ్!

Posted: 04/27/2016 01:24 PM IST
Chandrababu trying to bring that person to amaravathi

జగన్ కు చమటలు పట్టించిన వ్యక్తికి బాబు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా అనే వార్త ఇప్పుడు ఏపి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. గతంలో లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై మెరుపు విచారణ చేసిన పోలీస్ ఉన్నతాధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వర్తించిన ఈ డైనమిక్ ఆఫీసర్ త్వరలో నవ్యాంధ్రప్రదేశ్ లో పోలీస్ బాస్ గా రానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఒకటే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.

వైఎస్ జగన్ అక్రమాస్తుల విషయంలో తనదైన శైలిలో దర్యాప్తు నిర్వహించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న లక్ష్మీనారాయణ తన సర్వీసులో భాగంగా 2014లో మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అడిషినల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ సర్వీసు 2019వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను 3 ఏళ్ల డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు రప్పించుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని సమాచారం. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కమిషనర్ గా మాజీ జేడీని రప్పించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అధికారిక ఉత్తర్వులే ఆలస్యం అని తెలుస్తోంది. కాగా మరికొందరు మాత్రం ఆయనకు లా అండ్ ఆర్డర్ కాకుండా సాంఘిక, సేవా విభాగాల ముఖ్య అధికారిగా రావాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles