మోదీతో చంద్రబాబు కామెడీ చర్చ | Modi and Chandrbabu Naidus discussion in comedy style

Modi and chandrbabu naidus discussion in comedy style

Modi, Chandrababu Naidu, Delhi, Chandrababu Naidu Delhi Tour, Modi with Chandrababu, Chandrababu Discussion with Modi, Modi on AP, చంద్రబాబు, దిల్లీ, మోదీ, ఏపి

In Social Media a converstion between PM Naremdra Modi and AP CM Chandrababu Naidu going viral. This Funny conversation trending in Social Media.

మోదీతో చంద్రబాబు పేరడి

Posted: 04/26/2016 01:34 PM IST
Modi and chandrbabu naidus discussion in comedy style

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బాబుకు, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మధ్య జరిగిన సంవాదం గురించి.. సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ హల్ చల్ చేస్తోంది.  వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో ట్రెండ్ అవుతున్న ఈ డిస్కషన్ ను మీరు కూడా ఓ సారి చూడండి.

మోడీ : చంద్రబాబూజీ, ఎలా ఉన్నారు, చాలారోజులకు వచ్చారు... ఏంటీ విశేషాలు? నాకు వేరే దేశం వెళ్లాల్సిన పనేమీ లేదు ఇవ్వాళ... కాబట్టి తాపీగా మాట్లాడుకుందాం...

బాబు : సార్, మా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, మీరు మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకొండి సార్...

మోడీ : అవునా? జీతాలకే డబ్బుల్లేకపోతే MLC కి ఐదు కోట్లు, MLA కి ఇరవై కోట్లు ఇచ్చి ఎలా కొంటున్నారు? అని అడుగుతానని అనుకున్నారా, నెవ్వర్(never)... చెప్పండి, చెప్పండి...

బాబు : సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కు టైమయింది, ఇక వెళ్తాను...

మోడీ : ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావుగా... అడుగు... నువ్వడిగినంత టైమ్ ఇస్తాను ఇవాళ...

బాబు : సార్, మా రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయి, మీరే ఆదుకోవాలి...

మోడీ : అదేమిటి మరి? పేద రాష్ట్రం, అడుక్కుతింటున్న రాష్ట్రమని చెబుతావూ, ఖజానాలో పైసా లేదంటావు... కానీ నాకున్ని రిపోర్టుల్లోనేమో... పుష్కరాలకు 1800 కోట్లు , మీ ఇంటి వాస్తుకు 20 కోట్లు, ఇంకా మీ స్పెషల్ ఫ్లయిట్లకు, టెంపరరీ బిల్డింగ్స్ కోసం 200 కోట్లు, రుణ మాఫీ కోసం, చంద్రన్న కానుకల కోసం మరో 1000 కోట్లు ఖర్చు చేశారని ఉంది...

బాబు : సార్, నేను పోతా, నా ఫ్లయిట్ కి టైమయింది....

మోడీ : ఫరవాలేదులే, ఏదో అడగాలని వచ్చావు... ఏమీ చెప్పవేం, అడుగూ... మీరు మా స్నేహితులు చంద్రబాబూజీ... మీరేది అడిగినా చేస్తాం... మా వెంకయ్య మీదొట్టు...

బాబు : నిజం సార్, ఎంత కొట్టుకున్నా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు... కాస్త ఆ పన్ను రాయితీలు గట్రా ప్రకటించేస్తే బెటర్ కదా...

మోడీ : అదేంటీ, మరి మావాళ్లేంటి? మిమ్మల్ని చూసి 1000 MOU లు సైన్ అయ్యాయని, ఇంక కేంద్రం ఏమీ సహాయం చెయ్యవలసిన అవసరం లేదని చెబుతున్నారు... లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్టు మీ పత్రికల్లోనే ఎక్కడో చూసినట్టు గుర్తు..... ఏంటి ఇదంతా... నిజం కాదా?

బాబు : సార్ , మీ వాళ్ళు TV9, ABN చూస్తున్నట్టున్నారు, ఏదో బిల్డప్ కోసం మా చానెళ్ళు అలా చెప్పాయి, నమ్మొద్దు ప్లీజ్...

మోడీ : సరే, ఇప్పుడు నీకేం కావాలి? ఫరవాలేదు చెప్పు... ఏదో అడగాలని వచ్చావు... అడగవేం...?

బాబు : ఒక లక్ష కోట్లు ఇవ్వండి సార్... ఇదుగో నా కోరికల జాబితా... కాస్త చూడాలి సార్...

మోడీ : ఎవరు అక్కడ...? ఆ ఓటుకునోటు సీక్రెట్ ఫైల్స్, పోలవరం డబ్బుల బాగోతాలు, అమరావతి స్కాం సంగతులతో మనోళ్ల రిపోర్టులు ఓసారి ఇటు పట్టుకురండి... ఇంకేంటి చంద్రబాబూజీ?

బాబు : సార్ నేను పోతా, నాకు ఫ్లయిట్ కి టైమయింది...

మరుసటి రోజు తెలుగు దినపత్రికల్లో, చానెళ్లలో జోరుగా వార్తలు.... ఫలించిన మోడీ, బాబు భేటీ.... చంద్రబాబు మంచి విజన్ ఉన్నసీఎం అని పొగిడిన మోడీ... మోడీ కి బాబు కృతజ్ఞతలు..

(Note: ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందని వేసాం.. ఎవరినీ కించపరచాలని కాదు)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles