చరిత్రలో నుంచి చరిత్ర రాయడానికి.. | From the history to create history

From the history to create history

Baahubali, Balakrishna, Balakrishnacinema, Balayya, Balayya100, Balayya100thcinema, Gauthamiputrashatakarni, Gunashekar, Krish, Nandamuri, Rajamouli, Rudramadevi

Telugu cinema turning to show our ancient history. Rajamouli started the ancient style with his magadhera cinema. now its going viral.

చరిత్రలో నుంచి చరిత్ర రాయడానికి..

Posted: 04/23/2016 08:54 AM IST
From the history to create history

సినిమా అనేది నేటికి, రేపటికి వారధి. మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమాల్లో నేచురల్ గా ఉండే ఎలిమెంట్స్ ఎలాగూ ఉంటాయి. కానీ వాటిని మించి సగటు ప్రేక్షకుడికి ఆనందాన్ని, అనుభూతిని కల్పించడమే సినిమాల లక్ష్యం. ఆ మధ్యన సినిమాలు అన్నీ ఒకటే ట్రెండ్ లో నడిచాయి. ఏ సినిమా చూసినా కానీ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యాయి. ఓడలు బల్లవుతాయి. బల్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో మరి. గతంలో మనం మరిచిపోయిన చాలా కథలను ప్రస్తుతం మన కళ్లకు కడుతున్నాయి సినిమాలు.

ఏ దేశానికైనా, సంస్రృతికైనా కూడా గతం తెలియాలి... చరిత్ర తెలియకుండా ఏదీ సాధ్యం కాదు. సినిమాల విషయమే తీసుకోండి.. గతంలో ఓ సినిమా హిట్ అయింది అంటే దానిలో ఏమి ప్లస్ ఉన్నాయో తెలియాలి. ఓ సినిమా ప్లాఫ్ అయింది అంటే దానిలో ఉన్న లోపాలేంటో కూడా తెలియాలి. అలా తెలిసినప్పుడు మరోసారి ఆ తప్పులను రిపీట్ చెయ్యం. ఇలా చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అందుకే గతం లేని వాడి భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియదు అని అంటారు.

తాజాగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ప్రయత్నాలు చేస్తోంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న తెలుగు సినిమా తల్లి తన గత చరిత్రను అందించడానికి సిద్దంగా ఉంది. చరిత్రలో మిగిలిపోయిన గొప్ప వ్యక్తులను మనకు పరిచయం చేస్తూ చేస్తున్న సినిమాలు, ప్రయోగాలు ఎంతో హర్షనీయం. సినిమాలు అనగానే కేవలం ఎంటర్ టైన్ మెంట్ అనే ధోరణి నుండి సినిమా అంటే ఓ విజ్ఞాన నిధి అని అనుకులే చేస్తున్నారు మన టాలీవుడ్ దర్శకులు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ నాడు కవులు గళమెత్తిన అంశం ఇప్పటికీ మన నరాల్లో ఉంది అంటే చరిత్రకారుల పుణ్యమే. ఇప్పుడు మన దర్శకులు చరిత్రకారులుగా మారుతున్నారు. ఓ సినిమా కు స్టోరీ రాయాలంటే ముందు సబ్జెక్టు మీద పట్టుండాలి. సబ్జెక్ట్ మీద పట్టుండాలి అంటే ప్రతి పూచిక పుల్ల గురించి కూడా తెలిసి ఉండాలి. నిన్నటి గతం రేపటి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే మన వాళ్లు ఇప్పుడు నిన్నటి చరిత్రను వెతికే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపుగా అందరూ కూడా ఆ దిశగా సక్సెస్ కాలేకపోతున్నా కానీ జనాలకు మాత్రం కొత్త విషయాలను అందిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం.

గతంలో మన సినిమాల్లో కూడా చాలా వరకు చరిత్రలోని కొన్ని అంశాలతో కూడిన స్టోరీలతో సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం అలాంటి సినిమాలు మాత్రం రావడంలేదు. మగధీర సినిమాతో కాస్త గత చరిత్ర అనే కాన్సెప్ట్ లోకి తీసుకెళ్లిన రాజమౌళి ఆ దిశగా సక్సెస్ అయ్యారు. రాజులు, రాజ్యాలు నేపథ్యంలో మరోసారి చరిత్రలోని కొన్ని పేజీలను మన ముందు ఆవిష్కరించే ప్రయత్నించారు. తర్వాత వచ్చిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా తెలుగు సినిమా కీర్తి పతాకాలను నలువైపులా వ్యాపింపజేసింది.

బాహుబలి సినిమా తర్వాత గుణశేఖర్ రాణి రుద్రమదేవి నేపథ్యంలో తీసిన సినిమా కలెక్షన్లపరంగా సక్సెస్ కాలేదు. కానీ చరిత్రలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలను మనకు అందించింది. ఇక ఇప్పుడు బాలయ్య బాబు వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమాను చేస్తున్నారు. చరిత్ర పుట్టల్లో మిగిలిన పోయిన ఓ మహా వీరుడు, సామ్రాట్ గురించి తెలుసుకునే అవకాశం తెలుగువారికి కలుగుతోంది. తెలుగు సినిమాల్లో వస్తున్న ఈ మార్పు ఖచ్చితంగా మనకు ఎంతో ఉపయోగపడేదే.

చరిత్రలో నుండి గాధలను బయటకు తీసి వాటితో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్న మన దర్శకులకు ముందుగా నా అభినందనలు. తెలుగులో మరిచిపోయిన, తెలియని ఎన్నో గొప్ప విషయాలను ఆవిష్కరించడానికి దర్శకులు, నటులు చేస్తున్న కృషి అభినందనీయం. నందమూరి నటసింహం బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిని ఎంచుకోవడం ఎంతో గర్వించే విషయం. ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు తెలుగులో మరిన్ని వచ్చి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోవాలని, తీస్తున్న దర్శకులకు, నిర్మాతలకు, నటులకు మంచి గుర్తింపు, డబ్బులు రావాలని కోరుకుంటున్నా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles