టిఆర్ఎస్ ప్లీనరీకి కొన్ని షరతులు | election commission gave permission to TRS party plenary

Election commission gave permission to trs party plenary

TRS, plenary, TRS plenary in Khammam, Khammam elections, టిఆర్ఎస్, ప్లీనరీ, టిఆర్ఎస్ పార్టీ, ఖమ్మం

State election commission gave permission to TRS party plenary in Khammam. But election commission gave that in some limits.

టిఆర్ఎస్ ప్లీనరీకి కొన్ని షరతులు

Posted: 04/23/2016 07:07 AM IST
Election commission gave permission to trs party plenary

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి అనుమతి లభిస్తుందా లేదా..? అన్న సందిగ్దానికి తెర పడింది. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. సీఎం, మంత్రులు అధికార హోదాలో ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని ఈసీ ఆదేశించింది. పార్టీ నేతలుగా మాత్రమే హాజరుకావాలని చెప్పింది. అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని ప్లీనరీ పనుల కోసం ఉపయోగించొద్దని స్పష్టం చేసింది.

ఈసారి ప్లీనరీని ఖమ్మం జిల్లాలో నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ ముందుగానే నిర్ణయించింది. అయితే ఈలోపే పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలవడం,కోడ్‌ సమస్య రావడంతో.., కోడ్‌ ఉల్లంఘించకుండా ప్లీనరీ నిర్వహించుకుంటామని టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేయగా అందుకు ఈసీ సమ్మతించింది. దీంతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్‌. కాగా ఈ ప్లీనరీ ముగిసన తర్వాత కొంత మంది మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు అనే వార్త వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు నిజమో ప్లీనరీ తర్వాత తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles