సైకిల్ ఎక్కిన బొబ్బిలి | Bobbili MLA Sujay kumar joins TDP

Bobbili mla sujay kumar joins tdp

TDP, YSRCP, AP, Bobbili, Sujay, Chandrababu naidu. బొబ్డిలి, సుజయ్, చంద్రబాబు, టిడిపి, వైసీపీ

The migration from the YSR Congress seems to be continuing with the Bobbili Rajas reportedly contemplating joining the Telugu Desam Party. YSR Congress MLA from the Bobbili constituency R.V. Sujay Krishna Ranga Rao is likely to cross over to the ruling party soon.

సైకిల్ ఎక్కిన బొబ్బిలి

Posted: 04/20/2016 06:13 PM IST
Bobbili mla sujay kumar joins tdp

బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబి నాయనలు.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.  అభివృద్ధికి అందరూ సహకరించాలని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నామన్నారు. తాము టీడీపీలో చేరడం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలిగించమని, అందరినీ కలుపుకుని పోతామని ఆయన హామీ ఇచ్చారు.

‘టీడీపీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ. మనమంతా ఇప్పుడు క్రమశిక్షణ గల పార్టీలో చేరుతున్నాం. ఆ క్రమశిక్షణను ఎన్నడూ దాటకుండా ప్రజలకు సేవలందించాలి. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో శ్రమిస్తున్నారు. ఆయన కృషి, పట్టుదలకు మనమంతా సహకరించాలి" అని సుజయ్ పిలుపునిచ్చారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేదన్న బాధ ఉండేదని.. ఇప్పుడు అది లేదని విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తనను కార్యకర్తగా వాడుకోవాలని బాబుకు విజ్ఞప్తి చేశారాయన. అలాగే విజయనగరం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎంను కోరారు సుజయ్ కృష్ణ రంగారావు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles