Even President can go wrong: Uttarakhand High Court to Centre

President can be wrong says uttarakhand high court firmly to centre

Uttarakhand High Court, Uttarakhand, Harish Rawat, Uttarakhand political crisis, pm modi, union government, uttarakhand hc

"Even the President can go wrong," said the judges today who are deciding whether President's Rule was used in the hill state of Uttarakhand to get rid of the Congress government.

కేంద్ర నిర్ణయంపై హైకోర్టు చెంపపెట్టు.. రాజరికపు పాలన సాగదని వ్యాఖ్య

Posted: 04/20/2016 04:44 PM IST
President can be wrong says uttarakhand high court firmly to centre

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధిస్తేూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు చెంపపెట్టు లాంటి వ్యాఖ్యాలు చేసింది. ప్రజాపాలనను కాదని రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. కాగా రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం... ప్రస్తుతం రాజ్యాంగబద్ద పాలనలో వున్నామని గుర్తచేస్తూనే, ఇది రాచరికపు పాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటిపై పరిశీలన జరిపే అవకాశం లేదని స్పష్టం చేయడం చెల్లదని స్పష్టం చేసింది,

కాగా రాష్ట్రపతి నిర్ణయాన్ని పరిశీలించే అవకాశం తమకు వుందంటూనే.. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదనను తోసిపుచ్చింది. రాజుల పాలనలా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని కేంద్రానికి ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎటువంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయసమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది.

కాగా హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే తమ వ్యతిరేక కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో బేరసారాలాడి తమ ప్రభుత్వానికి మద్దతుగా వుండాలని కోరుతున్న వీడియోలు బహిర్గతం అయిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు జరుగుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles