Maid injured 3 children in Government Infant Residence caught on Camera

Maid injured 3 children in government infant residence caught on camera

Karimnagar, Karimnagar Hostel, Govt Hostels, Aaya, caretaker, Government Infant Residence, కరీంనగర్, శిశు విహార్

A shocking video about a caretaker 's cruelty towards small kids at a child care centre located in the Karimnagar district of Telangana has come to fore on Wednesday.The video shows a caretaker burning hands of children with hot spoon at a 'Shishu Greh' run by Telangana government.

ITEMVIDEOS: చిన్నారుల చేతులు కాల్చిన ఆయా

Posted: 04/20/2016 02:58 PM IST
Maid injured 3 children in government infant residence caught on camera

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాల్సిన శిశుగృహలో ముగ్గురు చిన్నారుల చేతులపై.. కాల్చి వాతలు పెట్టింది ఓ ఆయా. పద్మ అనే ఆయా ముగ్గురు చిన్న పిల్లల చేతులపై కాల్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ విషయం ఉదయం షిప్టుకు వచ్చిన ఆయాలు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిల్లలకు చికిత్స చేయించి, ఆయాలను విధులనుంచి తప్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

శిశు గృహంలో మొత్తం 9 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికోసం ఉదయం, సాయంత్రం షిప్టుల్లో ముగ్గురు ఆయాలు పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి షిఫ్టులో ఉన్న బుచ్చమ్మ, పద్మ, శారద అనే ఆయాలు చిన్నపిల్లలకు భోజనం పెట్టి అల్లరి చేస్తున్నారన్న కారణంగా వారి చేతులపై స్పూన్ కాల్చి వాతలు పెట్టారు. బుచ్చమ్మ అనే ఆయా స్టౌవ్ పై స్పూన్ వేడి చేసి ఇవ్వగా పద్మ అనే ఆయా ముగ్గురు చిన్న పిల్లల చేతులపై కాల్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles