Chinese driver terrible mistake makes him embarrassed

Chinese driver gets caught in a tight spot

Wei, car, driver, top of car, Wenzhou, Zhejiang Province, China, regret, terrible mistake, embarrassment, tiny incident, mobile phone, police

A driver dressed in white was seen standing on the top of his car in the center of a lake in Wenzhou, Zhejiang Province, in regret over the terrible mistake that caused him embarrassment.

‘నో మొబైల్ వైల్ డ్రైవింగ్’ అంటే వింటారా..? ఇలా జరుగుద్ది..

Posted: 04/17/2016 08:26 AM IST
Chinese driver gets caught in a tight spot

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినా.. దానిని వాహనం నడుపుతూ మాట్లాడవద్దని పదే పదే పోలీసులు చెప్పినా.. వినిపించుకోరు. తెలిసో, తెలియక మర్చిపోయే, లేక అవతల వాళ్లు కంగారు పడతారనో తప్పనిసరి పరిస్థితులనో ఇలా చాలా మంది వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతుంటారు. అంతే ఊహించని విధంగా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. అయితే అవి చిన్నాచితక ప్రమాదాలైతే పర్వాలేదు కానీ, అవే పెద్దప్రమాదాలు దారితీస్తే.. ప్రాణాలే కోల్పోతారు.

అదే ఒక వేళ చిన్న ప్రమాదమైనా.. అది కూడా ఇబ్బందులకు దారి తీస్తుంది. కానీ అవి ఒకింత ఫన్నీగా వుంటే వార్తల్లోకి వెళ్లడమే కాదు. హాస్యాన్ని కూడా బాగా పండిస్తుంది. ఇక్కడ కూడా సరిగ్గా అలానే జరిగింది, డ్రైవింగ్ చేస్తుండగా చేసిన చిన్న తప్పిదం ఓ వ్యక్తిని ప్రమాదపు అంచువరకు తీసుకు వెళ్లింది. ఫోటోలో తెలుపు రంగు దుస్తుల్లో నీటిలో మునుగుతున్న కారు పై భాగంలో.. దిక్కు తోచని స్థితిలో ఉన్న వ్యక్తి పేరు వీ. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని వెంజు సరస్సు పక్కనున్న రోడ్డు గుండా డ్రైవింగ్ చేస్తుండగా కారులోనే అతని ఫోన్ కిందపడింది.

అంతే దానికోసం వెతకడానికి కిందకు వంగాడు. డ్రైవింగ్ మీద ద్యాస పక్కన పెట్టి వెతకడంతో అనుకోకుండా యాక్సిలరేటర్ తొక్కాడు. దీంతో వేగంగా వెలుతున్నకారు అదుపు తప్పి పక్కనున్న చెట్టు ను ఢీకొట్టింది, అంతటితో అగకుండా ఏకంగా పక్కనున్న సరస్సులోకి దూసుకెళ్లింది. వెంటనే  అప్రమత్తమైన వీ విండోల ద్వారా బయటకు వచ్చి మునుగుతున్న కారుపైకి చేరుకున్నాడు. అక్కడి నుంచే సాయం కోరుతూ గట్టిగా అరవగా సమీపంలో గ్రామస్తులు అతన్ని కాపాడారు. కారును కూడా తాళ్ల సాయంతో బయటకుతీశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles