KCR said yes but devineni Uma said no

Kcr said yes but devineni uma said no

KCR, Ap, Telangana, Khammam, Polavaram

On Polavaram areas five villages which included to AP, KCR said as soon as possible trying to merge those villages to Telangana state.

కేసీఆర్ అవునన్నాడు.. దేవినేని ఉమ కాదన్నాడు

Posted: 04/16/2016 11:15 AM IST
Kcr said yes but devineni uma said no

తెలంగాణ సిఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఐదు మండలాలను తొందరలోనే తెలంగాణలో తిరిగి కలుపుకుంటామని.. దీని మీద సామరస్యంగా పరిష్కారం కోసం ఏపి ముఖ్యమంత్రితో మాట్లాడతానని ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ మాత్రం దీన్ని ఖండించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బదలాయింపు పై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమకు హామీ ఇచ్చారని గతంలో ఓసారి చెప్పిన కేసీఆర్... నిన్న మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని దేవినేని చెప్పారు. ఈ ముంపు మండలాలు ఏపీ పరిధిలో ఉంటేనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని దేవినేని చెప్పారు. ఐదు గ్రామాలను తెలంగాణకు బదలాయించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి హామీని చంద్రబాబు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని కూడా తెలంగాణకు బదలాయించేది లేదని కూడా దేవినేని తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Ap  Telangana  Khammam  Polavaram  

Other Articles