Sonia Gandhi fire om Chief Minister | ఆ సిఎంపై సోనియాగాంధీ ఫైర్..?

Sonia gandhi fire om chief minister

SOnia Gandhi, AICC, Karnataka, Siddaramayya, కాంగ్రెస్, సోనియాగాంధీ, కర్ణాటక, సిద్దరామయ్య

AICC President Sonia Gandhi very anger on Karnataka Chief Minister Siddiramayya. Siddiramayya facing some major alligations.

ఆ సిఎంపై సోనియాగాంధీ ఫైర్..?

Posted: 04/16/2016 12:46 PM IST
Sonia gandhi fire om chief minister

కాంగ్రెస్ అధినేత్రి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద గుర్రుగా ఉందట. ఆ సిఎం వైఖరి ఆమెకు ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే ఆ ముఖ్యమంత్రి వ్యవహారం మీద ఆమె.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చైర్మెన్ ను పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు.. కర్ణాటక సిఎం సిద్దరామయ్య. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ ఖరీదైన వాచ్ వ్యవమారంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సిద్దరామయ్య.. మరో వివాదం తెర మీదకు వచ్చింది. దానిపై కాంగ్రెస్ అధినేత్రి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కుమారుడు డాక్ట ర్‌ యతీంద్ర డైరెక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్‌ ఇమేజింగ్‌ సొల్యూషన సంస్థకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు కాంట్రాక్టు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ర్టానిక్‌ మీడియాలో దీనిపై భారీగా ప్ర చారం చేయడంతో అప్రమత్తమైన అదిష్ఠానం ఇం దుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నా రు. తన కుమారుడికి కేటాయించిన టెండర్‌ను రద్దు చేసే దిశలో ఆయన మరో రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles