Narendra Modi Shake hands prince

Narendra modi shake hands prince

Modi,Shake Hands, Williams, India

PM Narendra Modi welcomes England Prince Williams. He gave shake hands with full strength.

మోదీ షేక్ హ్యాండ్ కు షేక్ అవ్వాల్సిందే!

Posted: 04/15/2016 06:02 AM IST
Narendra modi shake hands prince

నరేంద్ర మోదీ ఇచ్చేది షేక్ హ్యాండా... లేదా ఉడుం పట్టా అని అనుకునేలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారట. తాజాగా మరోసారి మోదీ షేక్ హ్యాండ్ మీద కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నరేంద్రమోడీ షేక్ హ్యాండ్ ఇస్తే ఈ రేంజిలో ఉంటుందా అని నెటిజన్లు నివ్వేరపోతున్నారు. ఆ షేక్ హ్యాండ్ రుచి చూసింది ఎవరో కాదు బ్రిటన్ యువరాజు విలియమ్స్. ఇటీవల భారత్‌లో పర్యటన కోసం న్యూఢిల్లీ వచ్చిన బ్రిటన్ యువరాజు విలియమ్స్, యువరాణి కేట్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు.

రాజ దంపతులకు యువరాజు జార్జ్ ను గుర్తుచేసిన బుడతడు..

మోదీ ఇచ్చిన ఘన స్వాగతంతో పాటుగా బ్రిటన్ సంప్రదాయ ప్రకారమే షేక్‌హ్యండ్‌ను వారికిచ్చారు. మోడీ షేక్‌హ్యాండ్‌ను మామూలుగానే బలంగా ఇస్తారు. విలియమ్స్‌ కు కూడా మోడీ బలంగానే షేక్‌హ్యండ్ ఇచ్చారు. అయితే ఆ షేక్ హ్యాండ్ ఏ రేంజిలో ఉందంటే నరేంద్రమోడీ చేయి అచ్చు పడే అంతలా. ప్రిన్స్ బాగా ఫెయిర్‌గా ఉండటం వల్ల మోడీ షేక్‌హ్యాండ్ గుర్తులుండిపోయాయి. ఇది ఫోటోలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భారతీయుడి దెబ్బ.. బ్రిటీషోడి అబ్బా అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Shake Hands  Williams  India  

Other Articles