This Dosa Making Machine Invented by 24-year-olds Wowed the Royal Couple During Their India Tour

Student impresses prince william with a dosa machine one to be sent to buckingham palace

dosa maker, dosamatic, dosa, royal couple, prince william, princess kate, vikas eshwar, the social mumbai, mumbai, chennai, srm university, innovation, invention, Will-Kat, Prince William, Kate Middleton, Dosa Machines, Eshwar, Buckingham Palace, Chennai BTech Student

According to Eshwar, the royal couple, who are never seen to eat in public, had broken protocol to taste his dosas.

రుచిమెచ్చిన బ్రిటన్ రాజకుటుంబం.. దోస మేకర్ ను అర్ఢర్ చేసింది..

Posted: 04/14/2016 11:21 AM IST
Student impresses prince william with a dosa machine one to be sent to buckingham palace

కరకరలాడుతూ ఘుమఘుమలాడే కడక్ దోశ దక్షిణాదితో ఎంతో ఫేమ్. భారత్ పర్యటనలో భాగంగా ముంబై సందర్శించిన బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియమ్స్, కేట్‌లు కూడా ఈ దోశ రుచి చూసి వారెవ్వా! అంటూ ప్రశంసించారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి చెందిన మాజీ బీటెక్ విద్యార్థి 24 ఏళ్ల వికాస్ ఈశ్వర్, తాను కనిపెట్టిన దోశ మేకర్‌పై వేసిన దోశనే వారికి తినిపించి శభాష్ అనిపించుకున్నారు. ముకుంద ఫుడ్స్ వ్యవస్థాపక సీఈవో అయిన ఈశ్వర్ తన బ్యాచ్‌మేట్ సుబీత్ సాబత్‌తో కలసి ఈ దోశ మేకర్‌ను కనుగొన్నారు.  

దానికి ‘దోశామేటిక్’ అని కూడా పేరుపెట్టారు. రాజ దంపతుల గౌరవార్థం ముంబైలో ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో పాల్గొన్న ఈశ్వర్ రాజదంపతులను ఎంతగానో ఆకర్షించారు. వెంటనే ఓ దోశా మేకర్‌ను బ్రిటన్‌కు షిప్పింగ్ చేయాల్సిందిగా కూడా ఆర్డర్ పొందారు. చెన్నైలో దొరికే ఒకే రీతి మందం, ఒకే సైజు, ఒకే తీరు కడక్‌గల దోశ తనకు భారత్ దేశమంతటా పర్యటించినా ఎక్కడా దొరకలేదని, అందుకనే ఎప్పుడూ ఒకే తీరుండే దోశను తయారుచేసే పరికరాన్ని కనుగొనాలనే తపన నుంచే  ఈ దోశ మేకర్ పుట్టుకొచ్చిందని ఈశ్వర్ తెలిపారు.

ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన దోశ మేకర్ ఆకర్షించిందని, అయితే ఆయన అలా దూరం నుంచి చూసుకుంటూ వెళ్లారని చెప్పారు. ఇప్పుడు కూడా రాజ దంపతుల నుంచి అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావించానని, అయితే అందుకు విరుద్ధంగా వారొచ్చి తన దోశను తినడం, పరికరం పనిచేసే విధానం కూడా అడిగి తెలుసుకోవడం ఆనందం వేసిందని ఆయన వివరించారు. అంతకుమించిన ఆనందం తన దోశమేటిక్‌కు ఆర్డరివ్వడమన చెప్పారు. తన ఈ దోశమేటిక్‌కు అమెరికా, బ్రిటన్ దేశాల్లో యమగిరాకీ ఉందని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prince williams  Britain  dosa maker  Buckingham Palace  Eshwar  Chennai BTech Student  

Other Articles