Severe heatwave to return over Telangana, mercury sizzles at 44°C

Heat wave warning for telangana over next two days

heat wave warning, heat wave in india, heat wave in telangana, heat wave in andhra, weather in india, Telangana, Meteorological Department, Temperatures, Weather experts, Heat waves, YK Reddy, director in charge, Hyderabad metrological centre,

Heat wave conditions very likely to prevail over some parts in the districts of Hyderabad, Nizamabad, Karimnagar, Rangareddy, Khammam and Nalgonda over next five days.

అక్కడ భగ భగ, ఇక్కడ వడ దడ.. మరో రెండు రోజులు ఇంతేనట..

Posted: 04/13/2016 12:37 PM IST
Heat wave warning for telangana over next two days

రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండలు భగభగా మండుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం తొమ్మిదన్నరకే ఎండవేడి చురుక్కుమనిపిస్తోంది. సాయంత్రం అయిదు గంటలకూ వేడి సెగలు తగ్గడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను భయపెడుతున్నాయి. భారీగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు అంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రీష్మతాపం విలయతాండవం చేస్తుంది,

ఈ క్రమంలో రానున్న మూడు రోజులు పాటు ఎండల తీవ్రత మరింత అధికంగా వుండవచ్చునని వాతావరణ శాఖ ప్రకటనలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నాయి, ఇక ఎండల తీవ్రతకు తోడు వడగాల్పులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వడగాడ్పులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదుకావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇన్ని ప్రాంతాల్లో, ఇంతటి స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు నమోదుకాకపోవడం గమనార్హం.

మంగళవారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో 47 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా తంగుల్‌లో 47.43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపింది. కరీంనగర్ జిల్లా జైనాలో 46.87 డిగ్రీలు, సారంగాపూర్‌లో 46.21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 44.04, తిరుమలగిరిలో 44.16, అమీర్‌పేటలో 43.47, నాంపల్లిలో 43.39 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళనకరం.

వచ్చే రెండు రోజులు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండపూట బయటికి వెళ్లవద్దని సూచించింది. అటు గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 24 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles