lonely woman attacked and striped by lady rowdies in ysr kadapa district

Woman severely attacked by lady rowdies in kadapa

victim Indrani, woman attacked, unmaritual relationship, ysr kadapa district, produtoor, ganesh reddy, subbareddy kottala, arts collage, sridevi

A woman thrashed by a group of ladies in ysr kadapa district for having an illegal affair with a one of the womans husband.

అమ్మో.. ఆడవాల్లా..? రౌడీలా..? సభ్యత మరచి ప్రవర్తించారు..

Posted: 04/13/2016 09:39 AM IST
Woman severely attacked by lady rowdies in kadapa

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టకుందని ఓ మహిళ, తన బంధువులు, ఇరుగుపోరుగువారు, స్నేహితుల సాయంతో సదరు మహిళపై దాడికి పాల్పడిన ఘటన వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు సాటి మహిళ అని మర్చిపోయి అడ రౌడీల్లా వ్యవహరించారు, బాధితురాలి తలపై సుత్తితో మోది, జుట్టును కత్తిరించి, బట్టలను చించి అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలి సోదరుడి పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు.. ఇంద్రాణి అనే మహిళ సుబ్బిరెడ్డి కొట్టాలలో నివాసం ఉంటోంది. ఆమెకు 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. పావని, గణేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె భర్తతో విడిపోయింది. ఆర్ట్స్ కాలేజి రోడ్డులో నివాసం ఉంటున్న గణేష్‌రెడ్డి అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని చెప్పి మూడేళ్ల క్రితం ఇంద్రాణితో పరిచయం పెంచుకున్నాడు. ఏడాది కిందట ఈ విషయం అతని భార్య శ్రీదేవికి తెలియడంతో పలుమార్లు గొడవ పడింది. అదే సమయంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తనతో మాట్లాడవద్దని, తనకు తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టవద్దని ఇంద్రాణి ఆ రోజే గణేష్ రెడ్డికి తెగేసి చెప్పింది. అయినా తన భర్త ఇంద్రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని శ్రీదేవి 20 మంది మహిళలను వెంటబెట్టుకుని ఇంద్రాణి ఇంటికి వెళ్లింది. అందరూ కలిసి ఆమె ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఇనుప సుత్తితో ఆమె తలపై కొట్టి గాయపరిచారు. ఆపై ఆమెను కొందరు పట్టుకోగా, మరికొందరు కత్తెరతో జుట్టు కత్తిరించారు. ఆమె వేసుకున్న దుస్తులను చింపేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.

శ్రీదేవితో పాటు మరి కొందరు మహిళలు తనపై దాడి చేశారని ఇంద్రాణి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీరువాలో ఉన్న కొంత డబ్బు, 2.5 తులాల బంగారం కనిపించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ‘మా ఇంటి వద్దకు రావద్దని అతనికి ఏడాది క్రితమే చెప్పాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. వీళ్లు నన్ను చంపేస్తే నా పిల్లలు ఏం కావాలి. పిల్లల కోసమే బతుకుతున్నాను. నా బతుకేదో నన్ను బతకనివ్వండి. ఇంత మంది ఇంటి మీదికి వచ్చి రౌడీల్లా దాడి చేసి చంపేయబోయారు’  అంటూ బాధితురాలు ఇంద్రాణి పోలీసుల వద్ద వాపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles