IIT fee doubled, but waiver for SC/ST, poor, disabled students

Iit fee doubled but waiver for sc st poor disabled students

IIT, IIT Fees, C3entral Govt, The Indian Institutes of Technology, Smruthi Irani

The Indian Institutes of Technology (IITs) are set to double their tuition fee from the academic session beginning this summer after HRD Minister Smriti Irani approved an increase of 122 per cent from Rs 90,000 to Rs 2 lakh per annum. However, the fee hike will only be applicable to students admitted under the general category.

ఐఐటీలకు ఫీజుల భారం

Posted: 04/08/2016 12:01 PM IST
Iit fee doubled but waiver for sc st poor disabled students

పేద, మధ్య తరగతి విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇంతకాలం వైద్య విద్యే అందుబాటులో లేదనుకుంటే.. ఇప్పుడా జాబితాలోకి ఐఐటీ విద్య కూడా చేరింది. ఐఐటీ విద్యాసంస్థల్లో ఫీజులను కేంద్రం ఊహించని స్థాయిలో పెంచేసింది. ఫలితంగా ఇకపై ఐఐటీ విద్య కూడా ధనికులకు మాత్రమే సొంతం కానుంది. పేద మధ్యతరగతి విద్యార్థులను ఆ విద్యకు దూరం చేయాలనుకున్నదేమో అన్న అనుమానం కలిగేలా.. కేంద్రం ఏకంగా 300 శాతం మేర ఫీజులు పెంచేసింది. ప్రస్తుతం 90వేల దాకా ఉన్న ఐఐటీ విద్య ఫీజు ఇకపై ఏకంగా 3లక్షల రూపాయలకు చేరింది.

స్కూల్ ఫీజులు మొదలుకొని ఉన్నత విద్య వరకు ప్రతి విభాగంలోనూ ఫీజులు లక్షలకు చేరుతున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు టెక్నికల్ విద్యకు దూరం కావడం ఖాయమని విద్యావేత్తలు అంటున్నారు. ఫీజులను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్న ప్రభుత్వం కనీసం రుణ సదుపాయాన్నీ కల్పించడం లేదని విమర్శిస్తున్నారు. తగిన రీతిలో నిబంధనలు తయారుచేసి ఉన్నతవిద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని సూచిస్తున్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఫీజుల్ని పెంచడం ఇదే తొలిసారి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీపడుతూ ప్రభుత్వం కూడా ఫీజులను పెంచడం దారుణమని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. అన్ని వర్గాలకూ సాంకేతి ఉన్నత విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIT  IIT Fees  C3entral Govt  The Indian Institutes of Technology  Smruthi Irani  

Other Articles