Bumper Offer to AP Employees

Bumper offer to ap employees

AP, Employees, Chandrababu naidu, Govt Employees, days per week

Adopting a liberal view on the demands put forward by the secretariat staff to relocate to new capital region, Andhra Pradesh government has accepted to implement 'five-day week' for them from June 15, once they get shifted to the 'Interim Government Complex' being built at Velagapudi in the Amaravati capital region.

ఏపి ఉద్యోగులకు ఆఫర్.. కండీషన్స్ అప్లై

Posted: 04/08/2016 11:54 AM IST
Bumper offer to ap employees

చాలా యాడ్ లలో కేవలం వెయ్య రూపాయిలకే ఈ ప్రొడక్ట్ అని వస్తుంటుంది. కింద మాత్రం కండీషన్స్ అప్లై అని ట్యాక్స్ లు అవీ ఇవీ అన్ని కలిపి తడిసి మోపెడవుతుంది. అయినా ఈ ఆఫర్ గొడవేంటి.. టైటిల్ లో మాత్రం ఏపి ఉద్యోగులు అని చెప్పి లోపట మాత్రం ఇదేంటి అనుకుంటున్నారా..? అదే చెబుతున్నా. ఎలాగైనా ఈ ఏడాది జూన్ నాటికి ఉద్యోగుల తరలింపు భాగంలో భాగంగా ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. అమరావతికి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిదినాలు అంటోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉద్యోగుల తరలింపు నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి ఉద్యోగుల తరలింపు ఖరారైన నేపథ్యంలో ఈ నిర్ణయం ఉద్యోగులకు ఉగాది కానుకగా మారిందనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ పరిపాలన వచ్చే జూన్ 15 నుంచి జరిగేలా చేసేందుకు అవసరమైన తాత్కాలిక సచివాలయం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే భవనాల నిర్మాణం స్లాబ్ ప్రక్రియ దాక వచ్చింది. మే చివరికి మొత్తం నిర్మాణం పూర్తి చేసి జూన్1 నాటికి పరిపాలనకు సిద్ధం చేయడానికి వీలుగా పనులు శరవేగంగా చేస్తునారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలివచ్చే ఉద్యోగులకు వారానికి 5 పనిదినాలు మాత్రమే ఉండేలా మార్పు చేస్తునారు. దీంతో ఎక్కువ శాతం మంది తరలి వచ్చేందుకు ఆస్కారం కలిగింది. ఈ నిర్ణయంతో ఎక్కుమంది తమ కుటుంబాలు, పిల్లలు హైదరాబాద్లో ఉన్నా వారంలో 5 రోజులు పనిచేసి రెండు రోజులు హైదరాబాద్ వెళ్లి కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఉద్యోగులు మాత్రం ఇంతమంది ఒక్కసారిగా తరలి వెళ్ళడం వల్ల వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు, ఉద్యోగుల నివాస పరిస్థితులపై దృష్టిసారించారని కోరుతున్నారు. డీఏతోపాటు ఇతర కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం డీఏ తోపాటు 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగులు. మరి వీటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీంతోనైన ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి బాట పడతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Employees  Chandrababu naidu  Govt Employees  days per week  

Other Articles