Farmers using sex dolls as scarecrows to keep vermin away from crops

Farmers using sex dolls as scarecrows to keep vermin away from crops

muddy sex doll, yellow safety helmet, scaring off birds, people, china farmer, pests, scarecrow, inflatable sex doll, stark-naked blow-up doll, construction site, Chengdu, capital of China’s south-western Sichuan Province. local rapeseed farmer, ward off crows and pests. viral in China.

The muddy sex doll also wears a yellow safety helmet and has reportedly been effective at scaring off birds – as well as people

సెక్సు బొమ్మను అలా వాడి.. ఔరా అనిపించాడు..

Posted: 04/07/2016 12:30 PM IST
Farmers using sex dolls as scarecrows to keep vermin away from crops

ఆ మధ్య కాలంలో మన రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఓ రైతు చేసినట్లుగానే ఓ వింత పనికి చైనాలోని రైతు కూడా నడుం బిగించాడు. మెదక్ జిల్లాలోని ఓ రైతు పొలంలో పనిచేస్తుండగా, అతని మిత్రుడు వచ్చాడు, ఎండపడి వచ్చిన మిత్రుడిని ఇంటికి తీసుకెళ్లి అంబలి తాగిద్దామనుకుంటే.. అతని మిత్రుడు అందుకు బదులు కూల్ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరు కలసి ఓ అరలీటర్ బాటిల్ తీసుకుని తాగారు, ఇంకా అందులో కొంత వుండగా అది పోలంలోకెళ్లిన తరువాత తాగుమని మిత్రుడు చెప్పాడు.

పోలానికి వచ్చిన రైతు పనిలో పడి కూల్ డ్రింక్ విషయాన్ని మరిచాడు. తీరా పని పూర్తై ఇంటికెళ్ల సమయంలో అందులో వున్న డ్రింక్ ను తన పోలంలోని చెదలుకు పోసాడు. అంతే అవి మరణించాయ్. ఇక ఎంతో కష్టపడి క్రిమిసంహారాలు కొనేబదులు బదులు చౌకగా వచ్చే కూల్ డ్రింక్ ను తన పోలంలో స్ప్రే చేసి ఫలితాలు రాబట్టాడు, అప్పట్లో అది హాట్ టాపిక్ గా మారడంతో పాటు కూల్ డ్రింక్ అమ్మకాలు తగ్గడానికి కారణంగా కూడా మారింది.

సరిగ్గా ఇలానే అలోచించిన చైనాలోని రైతు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు, అంగళ్లలో ఈ మద్య బాగా దర్శనమిస్తున్న సెక్స్ టాయ్ ను కొనుకున్నాడు. ఏంటబ్బా రైతు కూడా ఈ బొమ్మను కొన్నాడని అక్కడివాల్లు నోళ్లు ఎల్లెబెట్టే సరికి ఆయన చేసిన పనిచూసి అంతా ముక్కున వేలువేసుకున్నారట, సాధారణంగా సెక్స్‌ టాయ్స్‌ను, డాల్స్‌ను ఎందుకు వాడతారు? శృంగార వాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ రైతు మాత్రం భిన్నంగా అలోచించాడు.

తాను కొన్న సెక్స్‌ డాల్‌ను తన పొలంలో దిష్టిబొమ్మగా ఉపయోగిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. దక్షిణ చైనాలోని సిచుయాన్‌ ప్రావిన్స్‌లో గల చెంగ్డూ అనే ప్రాంతంలో ఉండే ఓ రైతు ప్రత్యేకంగా సెక్స్‌ డాల్‌ను తయారు చేయించి దానిని తన పొలంలో పెట్టాడు. కాకులను, క్రిమి కీటకాలను పొలం వైపు రాకుండా చేయడానికే ఈ పని చేసినట్టు అతను తెలిపాడు. తలకి హెల్మెట్‌ కూడా పెట్టడం వల్ల ఆ బొమ్మ చూడడానికి అచ్చం మనిషిలాగానే ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇతగాడి ఐడియా వెరైటీగా ఉంది కదూ!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sex doll  sex toy  Chengdu  Sichuan Province. local rapeseed farmer  viral in China.  

Other Articles