Mercedes Hit-And-Run On Camera

Mercedes hit and run on camera

Delhi, Hit and Run, camera, CCTV, Mercedes, Sidharath Sharma

CCTV visuals have captured the moment when a 32-year-old man was hit by a Mercedes that came careening down the road with a Class 12 boy behind the wheel. Sidharth Sharma, realising that the car was not slowing down, tried to get out of the way but didn't stand a chance.

ITEMVIDEOS: కారుతో డ్యాష్ కొడితే గాలిలో ఎగిరిపోయాడు

Posted: 04/07/2016 12:36 PM IST
Mercedes hit and run on camera

రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని.. వేగంగా వస్తున్న ఓ కారు ఢీ కొట్టడంతో.. ఎగిరి దూరంగా పడిపోయాడు ఓ వ్యక్తి. న్యూదిల్లీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దార్థశర్మ అనే వ్యక్తి  రోడ్డు దాటుతుండగా మెర్సిడస్ కారు వచ్చి ఢీ కొట్టింది. కారుతో ఢీకొట్టిన తర్వాత కూడా కారు స్లో చేయలేదు. అంతే వేగంగా పేవ్‌మెంట్‌ మీదకు దూసుకుపోయాడు. కారు ముందు టైరు పగిలిపోవడంతో ఆగిపోయింది. లేకుంటే మరింత విధ్వంసం సృష్టించేదే.  అమాంతం గాలిలోకి లేచిన సిద్ధార్థ శరీరం.. నిర్జీవమై రోడ్డుపై పడింది. అతను అక్కడిక్కడే మృతి చెందాడు.

కారుతో ఢీకొట్టింది ఓ సంపన్నుడి మైనర్‌ కొడుకు. ఇంటర్ పరీక్షలు ముగిశాయన్న ఆనందంతో కారులో స్నేహితులతో జల్సా చేస్తూ.. అదుపులేని వేగంతో ఈ ప్రమాదానికి ఒడిగట్టి.. ఆ వెంటనే సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో సంపన్నుడైన అతని తండ్రిపై అభియోగాలు మోపారు.  ఈ ప్రమాదంలో తన ఒక్కగాను ఒక్క కొడుకును కోల్పోయిన హేమ్‌రాజ్ శర్మ మాత్రం పోలీసుల విచారణ ఓ జోక్‌లా కనిపిస్తోందని,  సంపన్నుడైన నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నేరగాళ్లకు శిక్ష విధించకుంటే రేపొద్దున మీ కుటుంబాలకు తన కుటుంబానికి వచ్చిన పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Hit and Run  camera  CCTV  Mercedes  Sidharath Sharma  

Other Articles