Roja said sorry to MLA Anitha

Roja said sorry to mla anitha

Roja, YSRCP, AP, Assembly, MLA Anitha

YSRCP MLA RK Roja infront of Privillage committee yester day. She also condemn the some other statments. She ask for action on Marfed photos.

క్షమాపణ చెప్పిన రోజా

Posted: 04/07/2016 07:23 AM IST
Roja said sorry to mla anitha

ఏపీ సభాహక్కుల సంఘం ముందు హాజరైన రోజా మీటింగ్ లో కూడా బాగానే ఫైర్ అయ్యారట. ఎమ్మెల్యే అనిత ను ఉద్దేశించి తానేమి తప్పుగా అనలేదు. ఒక వేళ ఆమె బాధపడి ఉంటే ఆ మాటలను వెనక్కితీసుకుంటున్నానని రోజా కమిటీకి చెప్పారు. అయితే…అదే సందర్భంలో అక్కడే ఉన్న అసెంబ్లీ కార్యదర్శకి బాగానే క్లాస్ తీసుకున్నారట రోజా. సభలో స్పీకర్ కు తెలియకుండా తనకు సంబంధించిన విజువల్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎలా వెళ్లాయో చెప్పాలని నిలదీశారట. దీంతో ఇద్దరి మధ్య వాగ్యుద్దమే జరిగినట్లు సమాచారం. మీకు తెలియకుండా ఎలా వెళ్తాయి. ఎవ్వరూ మాకు తెలియదంటే. మీరంతా ఎందుకు ఉన్నారని ఫైర్ అయినట్లు సమాచారం. తాను చేయని తప్పుకు సస్పెండ్ చేస్తున్నారు. మరి విజువల్స్ బయటకు లీక్ చేసిన మీ మీద చర్యలేవి. నేను సభకు, సభా హక్కుల కమిటీకి కూడా ఈ విషయం మీద ఫిర్యాదు చేశాను. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగి కమిటీలో రోజా నిప్పులు చెరిగినట్లు సమాచారం.

రోజా మాట్లాడుతూ ‘‘నేను క్షమాపణ చెప్పలేదు. నా వ్యాఖ్యలను మాత్రం ఉపసంహరించుకున్నా’’ అని తెలిపారు. కొన్ని బయటి శక్తులు అనితను ప్రేరేపించి ఈ వివాదం సృష్టించాయని ఆరోపించారు. ‘‘ఇది ఇద్దరు మహిళల మధ్య వివాదంగా మారడంతో వివరణ ఇచ్చేందుకు కమిటీ ముందు హాజరయ్యాను. నిజానికి, నేను తప్పు చేయలేదు’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. సభా హక్కుల కమిటీ ఇచ్చిన నోటీసుపై రోజా ఎట్టకేలకు స్పందించి... బుధవారం విచారణకు హాజరయ్యారు. హక్కుల కమిటీ తన తదుపరి నివేదికను స్పీకర్‌కు ఇస్తుంది. స్పీకర్‌ దానిని సభ ముందు ఉంచుతారు. దానిపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  AP  Assembly  MLA Anitha  

Other Articles