JC Diwakar Reddy controversial Statements on Jagan

Jc diwakar reddy controversial statements on jagan

YS jagan, JC Diwakar Reddy, YS Rajashekar Reddy, AP, Ananatur

Anatapur TDP Leader and Ex Minister JC Diwakar Reddy spoke unparliament words about YS Jagan

జగన్ గురించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు

Posted: 04/07/2016 12:28 PM IST
Jc diwakar reddy controversial statements on jagan

నోరు జారినా ..కాలు జారినా వెనక్కి తీసుకోలేమని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏదయినా జాగ్రత్తగా మాట్లాడాలి ..చూసుకుని అడుగేయాలి. కానీ మాజీ మంత్రి, అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి నోటి దూల ఎక్కువకదా. అందుకే ఎప్పుడూ మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. ఆ తరువాత దానికి వేరేదానితో పోలిక పెట్టడం తరచూ చూస్తున్నదే. గతంలో కూడా జెసి ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ నోరు జారిన జేసీ ఆ తరువాత తేరకుని చెంపలు వేసుకున్న దానికన్నా ఎక్కువే చేశాడు. “జగన్ ఎప్పుడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తారు అని చెబుతూ జగన్ ‘వాడెబ్బ’ అని... ఆ వెంటనే సారీ సారీ సారీ” అని అన్నాడు జేసి. మా వాడు అన్న భావనతో అన్నానని, ఇందులో ఇంకో ఉద్దేశం లేదని, జగన్ మరోలా అర్ధం చేసుకోవద్దని, మీడియా మిత్రులు దీనిని రాయొద్దని వేడుకున్నాడు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  JC Diwakar Reddy  YS Rajashekar Reddy  AP  Ananatur  

Other Articles