Priyanka Chopra invited to Barack Obama's last White House Corrospondents dinner!

Priyanka chopra invited to white house for barack obama s annual soiree

Priyanka Chopra, White House, White House Corrospondents dinner, Barack Obama, Michelle Obama, Bradley Cooper, Lucy Liu, Larry Wilmore, Quantico, Baywatch, White House, dinner

After slaying Oscars, Priyanka Chopra has now been invited to White House to attend the annual correspondents dinner later this month.

ప్రియాంకను వరించిన అరుదైన ఆఫర్.. ఢిన్నర్ విత్ ఒబామా..

Posted: 04/04/2016 07:29 PM IST
Priyanka chopra invited to white house for barack obama s annual soiree

ప్రముఖ బాలీవుడ్ నటి, హాలీవుడ్ లో తన సీరియల్స్ తో బుల్లితెరపై సెన్సెషనల్ గా మారిన నటి ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు వైట్ హౌస్ నుంచి డిన్నర్కు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా ఒక సాధారణ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అమెరికా శ్వేతభవనం పాటిస్తున్న ఆనవాయితీ. ది నాన్ ఫ్రాఫిట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రతి ఏటా ఒక డిన్నర్ నిర్వహిస్తుంటుంది. ఈ అసోసియేషన్ లో రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు ఉంటారు.

జర్నలిజంలో స్కాలర్ షిప్పులు అందజేసేందుకు కావాల్సిన డబ్బుకోసం వైట్ హౌజ్ తరపున ఈ డిన్నర్కు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పటికే క్వాంటికో అనే టీవీ కార్యక్రమంతోపాటు బే వాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకను వారు డిన్నర్కు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు, మిషెల్లీ ఒబామా కూడా పాల్గొంటారు. ప్రియాంకతోపాటు ఇతర హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్, ల్యూసీ లియూ, జేన్ ఫాండా, గ్లేడీస్ నైట్ కూడా ఈ విందుకు హాజరవుతారు. ఎంతైనా ప్రియాంకది అదృష్టమే. ఇప్పటి వరకు వైట్ హైజ్ డిన్నర్ కు ముందు ప్రియాంక, వైజ్ హౌజ్ డిన్నర్ కు తరువాత ప్రియాంక అన్నట్లు అమె జీవితం విభజించబడితే అనందించని భారతీయులు ఎవరుంటారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  hollywood  Quantico  Baywatch  White House  dinner  

Other Articles