Communal and Caste Factors Used to Divide Students: Medha

Medha patkar barred from university of hyderabad

high alert, hyderabad central university, medha patkar, kanhaiah kumar, rohith vemula, smruthi irani, rahul gandhi, HRD, cpi, cpi(m), ambedkar students association, vc appa rao, JNU row, lathi charge hcu, sitaram yechury, modi, PM narendra modi, suravaram sudhakar reddy, JNU

Noted social activist Medha Patkar was stopped from entering the University of Hyderabad. She spoke to the students at the gate on sunday night.

కుల, మతాల వివక్షలతో యువమేధావులను విభజిస్తున్న కేంద్రం..

Posted: 04/04/2016 10:30 AM IST
Medha patkar barred from university of hyderabad

యువ మేధావులను తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయాలలో కుల, మతాల అధారంగా విద్యార్థుల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలను సృష్టిస్తుందని, ఇందుకోసం వారి స్టూడెంట్ వింగ్ ఏబీవీపీని కూడా వాడుకుంటుందని  నర్మదా బచావో ఉద్యకారిణి, నేషనల్ అలెయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ జాతీయ నాయకురాలు మేధాపాట్కర్ అరోపించారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె ఆదివారం రాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు. లోపలికి వెళ్లకుండా ఆమెను ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గేట్ వద్దకు చేరుకున్న విద్యార్థులను ఉద్దేశించి గేటు బయట నుంచే మేధాపాట్కర్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్, రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని అమె అన్నారు. రోహిత్ తల్లి చెప్పిన దాన్నిబట్టి అతడు చాలా ధైర్యవంతుడని, అతనుంటే ఉద్యమానికి నాయకత్వం వహించేవాడని, లేకున్నా ముందుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. లోపలికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం చూస్తుంటే లోపల ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం అవుతోందన్నారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. బంజారాహిల్స్‌లోని లామకాన్‌కు చేరుకున్న మేధాపాట్కర్ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కులవివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని, అగ్రవర్ణాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. రోహిత్ మరణం తర్వాత యూనివర్సిటీల్లో తలెత్తిన పోరాటాలపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుబట్టారు. హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

వీసీ అప్పారావు వద్దంటూ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నా ఆయన్నే కొనసాగించడం సమంజసం కాదన్నారు. హెచ్‌సీయూ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఈ నెల 6న వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా తలపెట్టిన చలోఅసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రైతుల హక్కులు కాపాడాలని, పర్యావరణ హితంగా, రైతుల ప్రయోజనాలు నెరవేరేలా ముందుకు సాగాలని కోరారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles