telangana excise department achives record with 99.53 percent sales

Boozers create record in consuming liquor in telangana

Excise department, liqour sales, abkary department, Beer sales, IML, boozers, liquor consumption, Record consumption of liquor, liquor target achived, 100 percent liquor sales achived

telangana excise department achives record with 99.53 percent sales as boozers consumed cent percent liquor

తెలంగాణలో మందుబాబుల రికార్డు.. నూరు శాతం తాగేసారు..

Posted: 04/04/2016 10:27 AM IST
Boozers create record in consuming liquor in telangana

మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆబ్కారీశాఖ నూతన రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి నూరు శాతం రెవెన్యూ వసూళ్ల లక్ష్యంలో ఏకంగా 99.53 శాతం టార్గెట్‌ను సాధించింది. రూ. 12,200 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను నెలకు సుమారు రూ. 1,000 కోట్ల మద్యం అమ్మకాల డిమాండ్‌తో మార్చి 31 నాటికి రూ. 12,143 కోట్లు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 10,238 కోట్ల ఆదాయంకన్నా ఈసారి దాదాపు రూ. 2 వేల కోట్లు అదనంగా అందుకుంది.
 
రాష్ట్రంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయించే దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), బీర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ప్రాతిపదికగా తీసుకుంటా రు. 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి 31 వరకు రాష్ట్రంలో 238 లక్షల కే స్‌ల ఐఎంఎఫ్‌ఎల్‌ను విక్రయించారు. 2014-15లో 148 లక్షల కే స్ లను మాత్రమే విక్రయించగా ఈసారి ఏకంగా 90 లక్షల కేస్‌లు అదనం కావడం గమనార్హం. ఇక బీర్ల విక్రయాల్లో గత ఆర్థిక సంవత్సరం 282 లక్షల కేస్‌లను విక్రయించగా 2015-16లో ఏకంగా 334 లక్షల కేస్‌లు (52 లక్షల కేస్‌లు అదనం) విక్రయించారు. వీటితోపాటు లెసైన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ తదితరాల ద్వారా సమకూరిన మొత్తం రూ. 12.143 కోట్లుగా ఓ అధికారి తెలిపారు.
 
ఎక్సైజ్ శాఖ 12 నెలల కాలంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 12 వేల కోట్లకుపైగా సమకూర్చుకున్నా పన్నులు, ఇతర ఖర్చులు పోగా ఎక్సైజ్ శాఖకు మిగిలింది మాత్రం సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే. మద్యం ద్వారా వచ్చిన రాబడిలో విలువ ఆధారిత పన్ను రూపంలో (వ్యాట్ బై ఎక్సైజ్) రూ. 8,160 కోట్లు (67 శాతం) వాణిజ్యపన్నుల శాఖకు చేరిపోగా సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్‌కు మరో రూ. 222 కోట్లు జమ అయింది. లెసైన్సు ఫీజు కింద రూ. 1,859 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.1,660 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ. 231 కోట్లు కలుపుకొని ఆబ్కారీ శాఖకు సుమారు రూ. 3,750 కోట్లు మాత్రమే మిగిలింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles