Telangana Govt getting ready to move on Contract employees Regularisation

Ts govt getting ready to move on contract employees regularisation

Telangana, Rajiv Sharma, Contract Employees, Regularisation

Telangana Govt getting ready to move on Contract employees Regularisation. Telangana CS Rajiv Sharma today discuss the no of Employees in Conctract basis.

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై ముందుకు

Posted: 04/04/2016 06:35 AM IST
Ts govt getting ready to move on contract employees regularisation

తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ సిఎంగా అయిన తర్వాత చాలా సార్లు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. అయితే రెండు సంవత్సరాలు గడిచినా కానీ తెలంగాణ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి వేగంగా ఫైళ్లను కదిలించలేదు. అయితే తాజాగా దీనిపైనే సీఎస్ రాజీవ్ శర్మ అన్ని శాఖలు కార్యదర్శులతొ నేడు భేటీ కానున్నారు. దీంతో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్హులుగా ఉన్నారో ఓ క్లారిటీ వస్తుంది.

దీంతోపాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై కూడా నేటి మీటింగ్ లో చర్చించానున్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సీరియస్ గా వర్క్ చేస్తోంది సర్కార్. కమిటీ సిఫారసుల ప్రకారం.. రెగ్యులరైజేషన్ కు అర్హులైన వారి జాబితా పంపాలని.. గతంలోనే అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది ఆర్థికశాఖ. కానీ ఇప్పటివరకు.. చాలా శాఖలు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను పంపలేదు. శాఖల నుంచి జాబితా వస్తే తప్ప.. ఎంతమంది ఉంటారనేది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 25వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అంటోంది. కానీ క్రమబద్దీకరణ నిబంధనలకు తగ్గట్లుగా ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Rajiv Sharma  Contract Employees  Regularisation  

Other Articles