Telangana IT sector set for new policy boost

Telangana it sector set for new policy boost

IT policy, IT Insudtry, Telangana, KCR, KTR, startups, Telangana Govt

Information technology sector in Telangana is all set to get a major boost when TRS government led by Chief Minister K Chandrashekar Rao announces it maiden policy for the fast-growing software industry in the city on Monday.

ఆకర్షనీయంగా టిఎస్ ఐటీ పాలసీ

Posted: 04/04/2016 06:15 AM IST
Telangana it sector set for new policy boost

ఐటీ ఎక్స్ పోర్ట్స్ లో రెట్టింపు వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో.. కొత్త ఐటీ పాలసీ తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఔత్సాహికులకు ఐటీ రంగ పెట్టుబడుల్లో.. భారీ రాయితీ అందించే విధంగా పాలసీ ఉండబోతోంది. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో.. ఐటీ పరిశ్రమ విస్తరణే ధ్యేయంగా ప్రభుత్వం ఐటీ విధానాన్ని రూపొందించింది. ఈ కొత్త పాలసీని గవర్నర్, సీఎంలు రేపు ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఐటీ రంగంపై దృష్టిపెట్టింది. హైదరాబాద్ HICCలో నేటి సాయంత్రం కొత్త ఐటీ పాలసీని.. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తోపాటు.. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి హాజరుకానున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు దాని అనుబంధ రంగాలకు సంబంధించిన మరో 4 విధానాలను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు.. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేశారు. స్టార్ట్ అప్ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్ పేరిట పాలసీని రూపొందిస్తున్నారు. యువత వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, స్టార్ట్ అప్ కంపెనీలకు అనువైన వాతావరణం సృష్టించేందుకు.. ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. స్టార్ట్ అప్ కంపెనీలకు అంతర్జాతీయ సంస్థల నుంచి.. 2 వేల కోట్ల వరకు ఆర్థిక సాయం అందేలా.. ఐటీ విధానం ఉండబోతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకురానుంది.

పెట్టుబడులు ఆకర్షించి ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్ & మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీని తెస్తోంది. ఐటీ రంగంలో యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ ది ప్రత్యేకస్థానం. రాబోయే రోజుల్లో వీటికి మరింత డిమాండ్ పెరగనుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. యానిమేషన్ అండ్ గేమింగ్ పాలసీని ప్రకటించి రాయితీలు ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు కూడా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తోంది. రూరల్ టెక్ పేరిట పాలసీని తెస్తోంది. ఇప్పటికే ప్రాచుర్యంలో ఉండి అంతగా అమలులో లేని.. రూరల్ బీపీవో ల ఏర్పాటు పై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది.

ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రెట్టింపు వృద్ధిరేటు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 62వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో దీన్ని లక్షా 25 వేల కోట్లకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లకు రకరకాల రాయితీలు ప్రకటించనుంది. తక్కువలో తక్కువ 25 నుంచి 50 శాతం వరకు ఫిక్స్ డ్ క్యాపిటల్ సబ్సిడీని అందించేలా కొత్త ఐటీ పాలసీ తేబోతోంది. సంస్థల స్థాయిని బట్టి.. విద్యుత్ రాయితీలు, మునిసిపల్, పంచాయితీ పన్నుల్లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనుంది. వీటితోపాటు కంపెనీలకు ఇంటర్నెట్ లాంటి మౌళిక సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పించనుంది. సిబ్బందిని హైర్ చేయడంతోపాటు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కూడా కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT policy  IT Insudtry  Telangana  KCR  KTR  startups  Telangana Govt  

Other Articles