National Investigation Agency Officer Shot At 21 Times As Children Watched

Nia officer shot dead wife seriously injured

Mohammad Tanzeem, shot dead, NIA, NIA officer, Bijnor, Pakistan JIT, Pathankot attack, Mohammad Tanzil, National Investigation Agency, Uttar Pradesh, Pakistan based militants, Air Force base

A National Investigation Agency (NIA ) officer was shot dead in Uttar Pradesh's Bijnor on Saturday night while he was returning from a wedding with his family in a car.

పఠాన్కోట్ ఘటన దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఎ అధికారి హత్య..

Posted: 04/03/2016 10:06 AM IST
Nia officer shot dead wife seriously injured

ఉత్తరప్రదేశ్లో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) అధికారి మహమ్మద్ టంజీల్ దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఐఏలో డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న టంజీల్ తన కుటుంబ సభ్యులతో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బిజ్నూరు సమీపంలో సాహస్ పూర్ పట్టణ శివార్లలో గుర్తు తెలియని దుండగులు ఆయన కారును అపి అతనిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఆయన అక్కడికక్కడే మరనించగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య మాత్రం జీవన్మారణాల మధ్య కోట్టుమిట్టాడుతుంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అధికారిని, ఆయన సతీమణిని స్థానికంగా గల అస్పత్రిలో చేర్పించగా, అప్పటికే టంజీల్ మరణించాడని వైద్యులు తెలపారు. కాగా, తమ కారును కొంత దూరం నుంచి వెంబడిస్తూ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయన కారును ఆపి ఆయనపై 21 రౌండ్ల కాల్పులు జరిపారని సమాచారం, కాగా ఆయన భార్య శరీరంలో నాలుగు రౌండ్ల బుల్లెట్లును గుర్తించిన వైద్యులు అమెకు శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిణ చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. డిఐజీ అధికారి స్థాయి అధికారి ఆధ్వర్యంలో తమ అధికారి దారుణ హత్యఘటనపై జాతీయ దర్యాప్తు బృందం అధికారులు విచారణ చేస్తున్నారు. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడిచేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందంలో టంజీల్ కీలకంగా వ్యవహరించడంతో పాటు పలు ఆధారాలను సేకరించారు. సరిగ్గా ఇస్లామాబాద్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ బృందం దేశం విడిచి వెళ్లిన తరువాతే ఆ ఘటన ధర్యాప్తు అధికారి హత్యగావించడబడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Tanzeem  shot dead  NIA  NIA officer  Bijnor  Pakistan JIT  Pathankot attack  

Other Articles