Telangana govt may merge govt schools

Telangana govt may merge govt schools

telangana, Govt, School

Telangana govt collceting stats on govt school. Govt plans to merge govt school where teacher and students ration not comfortable.

ప్రభుత్వ పాఠశాలల విలీనం

Posted: 04/01/2016 08:26 AM IST
Telangana govt may merge govt schools

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లు ఉండటం. ఒక్క విద్యార్థి ఉంటే ముగ్గురు టీచర్లు ఉండటం జరుగుతోంది. అలా కాకుండా ఆ స్కూల్ కు దగ్గరలో ఉన్న స్కూల్ లో విలీనం చేసి.. ఆ విద్యార్థి చదువును కొనసాగించగలిగితే మంచిదని ప్రభుత్వం ఆలొచిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విలీనం మీద చురుకుగా చర్యలకు సాగుతోంది. జిల్లా స్థాయి అధికారులు ఈ మేరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలు జారీఅయ్యాయి. విద్యాసంంవత్సరం మొదలయ్యే సమయానికి దీన్ని పూర్తి చయ్యాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల విలీనం జరుగుతుంది.

జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్స్ రేషనలైజేషన్ పై వర్కవుట్ చేస్తున్నారు అధికారులు. తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని దగ్గరల్లోని మరో స్కూల్లో విలీనం చేయాలని గతంలోనే సర్కార్ నిర్ణయించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే లోపే ఫుల్ డీటెల్స్ సేకరించే పనిలో పడ్డారు అధికారులు. మండలాల వారిగా ఉన్న స్కూళ్ల ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ వాటి స్టేటస్ తో సర్కార్ కు రిపోర్ట్ చేయనున్నారు..

గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడంతో స్కూళ్లను మెర్జ్ చేయాలని నిర్ణయించింది సర్కార్. వాటి నిర్వహణ భారం తగ్గించుకునేందుకు రేషనలరైజేషన్ ను తీసుకొస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్ దూరంలోపు ఓ గవర్నమెంట్ స్కూల్ ఉండాలన్న రూల్ ను తొలగించి, స్కూళ్ల విలీనాన్ని ప్రతిపాదించింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. అయితే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చినా సర్కార్ మాత్రం అనుకున్న విధంగానే ప్రాసెస్ కంప్లీట్ చేసే పనిలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  Govt  School  

Other Articles