This Man Insisted On Doing Yoga During A Flight, And Is Now In Jail

Us airline aborts flight after passenger opts for yoga over sitting down

Hyongtae Pae, yoga, South Korea passenger, Honolulu, Hawaii, South Korea, yoga, arrested, flight, angry, headbutt, violent, bite, US news, Air transport, aviation, standard, world-news, yoga, wirecopy, blacklist, news

Hyongtae Pae threatened to kill passengers and shoved his wife after being told to sit down for meal service during flight from Hawaii to Japan, court hears

విమానంలో యోగా.. దక్షిణ కొరియా వ్యక్తి అరెస్టు..

Posted: 03/31/2016 05:48 PM IST
Us airline aborts flight after passenger opts for yoga over sitting down

విమానంలో యోగా చేసినందుకు ఓ దక్షిణ కొరియాకు చెందిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని జైలులో పెట్టారు. విమానంలో యోగా చేయడం కూడా నేరమేనా..? అంటారా..? విమానంలో ప్రయాణం చేస్తున్నామన్న విషయాన్ని మరచి తన భార్యపై దౌర్జన్యం చేసిన భర్త ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు. భార్యతో విమానంలో గొడవ పడితే అరెస్టు చేస్తారా..? అంటే అంతేకాదు విమాన సిబ్బందితో కేడా గొడవ పడ్డాడు. అంతమాత్రానికే అరెస్టు చేసి జైళ్లో పెడతారా..? అంటే మీరు పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

జపాన్ కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో మార్చి 26న ఈ ఘటన చోటుచేసుకుందని ఎఫ్ బీఐ తెలిపింది. హొనోలులు ఎయిర్ పోర్టు నుంచి నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా వెళుతున్న విమానంలో హయొంగటాయ్ పాయె అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడని వెల్లడించింది. భోజనం వడ్డించే సమయంలో సీటులో ఉండడనని చెప్పి విమానంలోని వెనక భాగానికి వెళ్లి యోగా, మెడిటేషన్ చేసుకునేందుకు పాయె వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి సీటులో కూర్చొమని అతడి భార్య, సిబ్బంది కోరడంతో కోపంతో ఊగిపోయాడు. భార్యను పక్కకు తోసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులను చంపేస్తానంటూ బెదిరించాడు.

దీంతో హయొంగటాయ్ భార్యను అతడి వెనుక సీటులో కూర్చొబెట్టారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసి, అమెరికా కోర్టులో ప్రవేశపెట్టారు. 25 వేల డాలర్ల పూచీకత్తుతో అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయింది. అయితే పాయె మానసిక స్థితిగా సరిగా లేదన్న కారణంతో అతడిని విడుదల చేయలేదు. అతడి భార్యకు, ఇతరులకు ప్రాణి ఉందని భావిస్తున్నారు. డిప్రెషన్ లో ఉన్న పాయె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని కూడా వెల్లడించారు. తమ 40వ వివాహ వార్షికోత్సవాన్ని హవాయ్ లో జరుపుకునేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పాయె భార్య కిమ్ వాపోయింది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఇటీవలే ఆయన యోగా నేర్చుకున్నాడని, గత 11 రోజులుగా ఆయన సరిగా నిద్రపోలేదని వెల్లడించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyongtae Pae  yoga  South Korea passenger  Honolulu  

Other Articles