talasai Srinivas respond on Kidnap case

Talasai srinivas respond on kidnap case

Talasani, Talasani Srinivas Yadav, Kothapalli Geetha

Talasani Srinivas Yadav responds in police case on his son. He said that no kidnap happend. He also said that Kothapalli Geetha and Her Husband has to give 11 crores debt.

ITEMVIDEOS: అసలు కిడ్నాపే జరగలేదు: తలసాని

Posted: 03/31/2016 11:17 AM IST
Talasai srinivas respond on kidnap case

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు మీద తాజాగా కేసు నమోదైంది. దానిపై తలసాని స్పందించారు. కొత్తపల్లి గీత భర్తది కిడ్నాపే కాదని.. అన్నారు. అయినా ఎవరైనా తాజ్ కృష్ణలో కిడ్నాప్ చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. అక్కడి సిసిటీవీ పుటేజులు చూస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. రామకోటేశ్వర రావు నుంచి తన కొడుకు  బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడని  గీత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.  కొన్ని వ్యాపారాల పేరిట మావద్ద రామకోటేశ్వర రావు 2011లో  11 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని..కానీ ఇప్పటి దాకా చెల్లించలేదని కూడా ఆయన అన్నారు.

డబ్బుల విషయంలో తన కొడుకు రామకోటేశ్వర రావు తో మాట్లాడిన విషయం నిజమేనని తలసాని అన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన చర్చల్లో.. డబ్బులడిగిన తన కొడుకుతో తన పేరిట ఉన్న ఐదెకరాల భూమి పత్రాలను హామీగా పెడతానని రామకోటేశ్వర రావు స్వయంగా చెప్పాడని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులను మోసగించిన చరిత్ర గీత, రామ కోటేశ్వర రావులకు ఉందని, తమను కూడా మోసగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఇచ్చిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలుసని చెప్పిన తలసాని.. ఈ వ్యవహారానికి సంభందించి పూర్తి వివరాలు రేపు తెలియజేస్తానన్నారు. కొన్ని ఫోటోలను కూడా ఆయన మీడియాకు చూపారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో తాము లీగల్ గా వెళ్తామని, విచారణ చేసి ఎవరిది తప్పో తేల్చుకుందామని సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani  Talasani Srinivas Yadav  Kothapalli Geetha  

Other Articles