Did Thalasani Srinivas son warn MPs husband

Did thalasani srinivas son warn mps husband

MP Kothapalli geetha, Talasani, talasani son,Paruchuri Ramakoteshwar rao

MP Kotha Palli Geetha husband Paruchuri Ramakoteshwar rao gave a police complaint on Talasani Srinivas Yadav Son. police registerd a case on whole issue.

ఎంపీ భర్తను బెదిరించిన తలసాని కొడుకు..!

Posted: 03/31/2016 08:31 AM IST
Did thalasani srinivas son warn mps husband

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపిన కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్ మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. తనను ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదని కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు వెల్లడించారు. తనను కేవలం బెదిరించారని తెలిపారు. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తన భూమిని ఆర్ ఆర్ కన్ స్ట్రక్షన్ కు డెవలప్ మెంట్ కు ఇచ్చానన్న ఆయన... సదరు సంస్థ బిల్డర్ రామకృష్ణ తనను బెదిరించారని ఆరోపించారు. నిన్న సాయంత్రం రామకృష్ణ తనను నగరంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లగా, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి బెదిరించారన్నారు.

ఈ క్రమంలో తమ భూమికి చెందిన పత్రాలను లాక్కోవడమే కాక కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని వదిలేశారని చెప్పారు. జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్టు కాలనీ సమీపంలో తనను కారులో ఎక్కించుకున్న రామకృష్ణ ఆ తర్వాత అర్ధరాత్రి కొండాపూర్ పరిధిలో వదిలేశారని తెలిపారు. అయితే తాను కిడ్నాప్ నకు గురయ్యానంటూ తన భార్య కొత్తపల్లి గీతకు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని ఆయన పేర్కొన్నారు. జరిగిన విషయాన్నంతా పంజాగుట్ట పోలీసులకు చెప్పడంతో పాటు తనను బెదిరింపులకు గురి చేసిన తలసాని కొడుకు సాయిపైనా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP Kothapalli geetha  Talasani  talasani son  Paruchuri Ramakoteshwar rao  

Other Articles