Vijay Mallya ready to pay Rs 4000 crore to lenders by September

Vijay mallya offers to repay rs 4000 crore to banks by september

vijay mallya, bad debts, 4000 crores repayment, supreme court, siddharth mallya, kingfisher group, SBI, Bank of Baroda, IDBI Bank, PNB, Kingfisher Airlines, lenders, State Bank of India, Bank Of Baroda, Punjab National Bank

Vijay Mallya, chairman of the grounded Kingfisher Airlines, has submitted a repayment plan to the Supreme Court. He is ready to pay Rs 4,000 crore by September 2016 to the banks.

ITEMVIDEOS: రూ. 4 వేల కోట్ల రుణం తీరుస్తారట.. కానీ కొడుకు మాత్రం తిట్టవద్దట..

Posted: 03/30/2016 04:52 PM IST
Vijay mallya offers to repay rs 4000 crore to banks by september

తోమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా.. తన ఆస్తుల వేలాన్ని నిలిపివేయాలని అందుకు అనుగూణంగా తాము బ్యాంకులతో చర్చలు సాగిస్తున్నట్లు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు అప్పులు ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. దాంతో బ్యాంకుల కన్సార్షియం ఈ ప్రతిపాదనకు స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు వ్యాపారాలతో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తర్వాత పూర్తిగా అప్పులపాలై వ్యాపారాలన్నింటినీ దాదాపు వదులుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్ యాజమాన్యాన్ని కూడా వేరే విదేశీ సంస్థకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ప్రతిపాదన చేశాడు.

అయితే మాల్యా ప్రతిపాదనపై బ్యాంకులు కొంచెం అలోచించి నిర్ణయం తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఒకవేళ మాల్యా చేస్తున్నది వన్ టైం సెటిల్ మెంట్ అయితే మాత్రం బ్యాంకులు ఆ ప్రతిపాదనను తిరస్కరించాలన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. విజయ్ మాల్యా తరహాలోనే అనేక మంది పారిశ్రామిక వేత్తలు అదే బాటలో పయనిస్తున్నారని, వారందరూ కూడా మాల్యా తరహాలోనే కోర్టులను ఆశ్రయించి.. మాల్యా ఘటనను ఉదాహరణగా పేర్కోంటూ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేత వేసే అవకాశముంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అదే సమయంలో తాను చేసిన రుణాలకు  కావాలంటే తనను తిట్టుకోవాలి గానీ, తన అబ్బాయిని మాత్రం ఏమీ అనొద్దని విజ్ఞప్తి చేశాడు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన మాల్యా ఇక్కడి నుంచి ఇంగ్లండ్ పారిపోయిన విషయం తెలిసిందే. తన కొడుకు సిద్దార్థ మాల్యాను ఈ వివాదంలోకి లాగొద్దని అన్నాడు. తన కొడుకు సిద్ మీద అనవసరంగా ద్వేషభావం చూపొద్దని, తిట్లు తిట్టొద్దని తెలిపాడు. అతడికి తన వ్యాపారంతో ఏమాత్రం సంబంధం లేదని, మీకు తప్పనిసరి అయితే తన మీద తిట్ల వర్షం కురిపించాలి గానీ అతడిమీద కాదని అన్నాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చు గానీ కుర్రాడిని ఎందుకని ట్వీట్ చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles