Ap government to walk in the way of Delhi and Telangana, hikes mla, mlc salaries

Andhra pradesh mla mlcs salaries to rise

Andhra Pradesh, AP MLAs salaries, AP Mlc salaries, cm chandrababu, andhra pradesh, mla, mlc, salaries, hike, Ap government

Andhra pradesh government also to walk in the way of Delhi and Telangana, hikes mla, mlc salaries including allowencea and pensions

ఢిల్లీ, తెలంగాణల బాటలోనే ఆంధ్రప్రదేశ్.. వేతనాల పెంపు

Posted: 03/30/2016 09:47 AM IST
Andhra pradesh mla mlcs salaries to rise

ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల బాటలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పయనించనుంది. ప్రజా సేవకులం అంటూ చట్టసభలకు ఎన్నికయ్యే వారికి ఏకంగా లక్షలాధి రూపాయల ప్రజాధనాన్ని వేతనంగా ఇవ్వనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో.. ఇప్పటి వరకు రూ. 95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల జీతాన్ని రూ. 1 లక్షా 50 వేలకు పెంచాలని, హెచ్ఆర్ఏను రూ. 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించారు.

ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫించన్ను సైతం 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. రైల్వే చార్జీల నిమిత్తం లక్ష రూపాయలు, బుక్స్ అలవెన్స్ కింద లక్ష రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, వాహనాల అడ్వాన్స్కు గాను ఇంతకు ముందున్న 10 లక్షల రూపాయలను 20 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఈ భారీ పెంపుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

సామాన్య రైతులు కరువు ప్రభావంతో వందలు, వేల రూపాయల రుణాల కోసం అంగలార్చుతున్నసమయంలో వారిని పట్టించుకుని, కష్టాలను తీర్చే మార్గాలను అన్వేషించాల్సిన ప్రభుత్వాలు మాత్రం తమ హయాంలో ఫలాన జరిగిందని చెప్పుకునేందుకు గోప్పలకు పోతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలను పెంచే కార్యక్రమానికి ప్రధాన్యతను ఇస్తున్నాయి. ఎన్నికల సమయాల్లో ప్రజలకు ఇబ్బడుముబ్బెడుగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అవి తీర్చిన తరువాత తమ వేతనాలను పెంచుకుంటే అక్షేపించే వాదనలు కూడా తెరపైకి రావన్న విషయాన్ని అధికార పక్షాలు మర్చిపోతున్నాయి.

నిరుద్యోగ యువత ఉపాధి లేక కనీసం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా వారి తల్లిదండ్రులపైనే అధారపడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి వారికి కల్పించాలి. ప్రభుత్వాలు కోలువుదీరి రెండేళ్లు కావస్తున్నా.. అసలు ఆ ఊసే ఎత్తకుండా జీతాలను మాత్రం రెట్టింపు స్థాయికి పెంచుకోవడంలో అర్థమేమీటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది. మొత్తానికి ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను కూడా విస్మరించకుంటే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm chandrababu  andhra pradesh  mla  mlc  salaries  hike  Ap government  

Other Articles