Mamata Banerjee hits out at Amit Shah for 'bombs in Bengal' remark

Shah mamata cross swords over rabindra sangeet

amit shah, mamata banerjee, west bengal election 2016, ravidranath tagore, BJP, Congress, Trunamul congress, Cpi(M), Cpi, rahul gandhi, sonia gandhi, sujana chowdary, vasundhara raje, shivaraj singh chowhan, sushma swaraj, arun jaitley,

Rabindra Sangeet, a popular genre of Bangla music, was today dragged into the high decibel poll campaign in West Bengal with BJP President Amit Shah and Chief Minister Mamata Banerjee crossing swords.

అమిత్ షా వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్.. పెద్ద శత్రువును అవుతా..

Posted: 03/30/2016 11:20 AM IST
Shah mamata cross swords over rabindra sangeet

దశాబ్దాల పాటు ఏకచక్రాధిపత్యంగా కొనసాగిన వామపక్షాల పాలన, వారితో పోరాటం చేస్తూ పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకించి, ప్రజలకు, సామాన్య రైతులకు అండగా నిలిచి వారి పక్షన ఉద్యమించి ఎట్టకేలకు అధికారాన్ని చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ ల మధ్యలోకి తమ ఉనికి లేని చోట కాసింతైన లబ్దిపోందాలని యోచిస్తూ.. ఆ దిశగా పయనిస్తున్న భారతీయ జనతా పార్టీ.. అదే క్రమంలో పూర్వవైభవం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలతో పశ్చిమ బెంగాల్ లో చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే నిజానికి చెప్పాలంటే వాస్తవంగా మాత్రం పోటీ వామపక్షాలకు, తృణముల్ పార్టీకి మధ్యే ఉంది.

అయితే ఈ విషయాన్ని మాత్రం బీజేపి నేతలు అంగీకరించడం లేదు. తమ సత్తా ఎంటో చాటుతామని, ఫలితాలు వెలువడిన రోజునే తమ పార్టీ కార్యచరణ, వ్యూహాలు, ప్రతివ్యూహాలు అందరికీ అర్థమవుతాయని అంటున్నారు. అధికార తృణముల్ కాంగ్రెస్ మళ్లీ అధికార పగ్గాలను అందుకునే అవకాశం వుందన్న ప్రీ ఫోల్ సర్వేలను కూడా తోసిరాజుతున్నారు. అందుకనే ఏకంగా అధికార తృణముల్ కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఎలాగైన పశ్చిమ బెంగాల్ అధికార పగ్గాలను తాము అందుకోవాలన్న ఉద్దేశ్యంతో బాజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకంగా అక్కడే తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుని మరీ ప్రచార కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తృణముల్ కాంగ్రెస్ నేతలు లంచాలను తీసుకుంటూ కెమెరాలకు అడ్డంగా చిక్కారని, అయితే వారిని మమత బెనర్జీ పార్టీ నుంచి తొలగించారా.? అని ప్రశ్నించారు. దీనిపై తృణముల్ కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగానే స్పందించారు.

వ్యాపం స్కామ్ లో అరోఫణలు ఎదుర్కోంటున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పదవి నుంచి దింపిన తరువాత తమ వారిని ప్రశ్నించాలన్నారు. ఢిఢీసీఎ అంశంలో అరుణ్ జైట్లీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిని పక్కన బెట్టుకుని తాము నీతి వంతులమని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. లలిత్ మోడీని అంశంలో అరోపణలను ఎదుర్కోంటున్న ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిపై చర్యలు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని చురకలంటించారు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం అంశంతో ఇరువురూ కత్తులు దూసుకున్నారు. అమిత్‌షా కోల్‌కతాలో మాట్లాడుతూ.. ‘తృణమూల్ పాలనలో బెంగాల్‌లో బాంబుల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఆ బాంబు పేలుళ్ల మోతలతో ఠాగూర్ సంగీతం సైతం మరుగునపడి పోయింది’ అని అన్నారు. దీనిపై మమత బెనర్జీ మండిపడ్డారు. ‘బెంగాల్‌ను ఎవరైనా అవమానిస్తే.. వారికి నాకంటే పెద్ద శత్రువు మరొకరు ఉండరు. ఠాగూర్ వంటి గొప్పవారి గురించి అవమానకరంగా మాట్లాడితే బెంగాల్ ప్రజలు క్షమించరు’ అని చురక అంటించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  mamata banerjee  west bengal election 2016  ravidranath tagore  

Other Articles