Tied a man to Train window

Tied a man to train window

Madhyapradesh, Train, Sumit, Loksmanya Thilak Super fast Express

In a shocking case of extreme violence over a trivial issue, a man was tied to a train's window and beaten up by three men after he drank water from their bottle.The incident occurred on March 25 when a youth named Sumit boarded Patna-Lokmanya Tilak Terminus Superfast Express at Jabalpur at around 11 pm.

ITEMVIDEOS: రైల్ కిటికీకి కట్టేసి మరీ కొట్టారు

Posted: 03/29/2016 11:18 AM IST
Tied a man to train window

కొన్ని సంఘటలు చూస్తే అసహ్యం వేస్తుంది. మనుషుల్లాగా కాకుండా విచక్షణలేని పశువుల్లాలా ప్రవర్తిస్తుంటారు కొంత మంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పాట్నా నుండి లోకమాన్యా తిలక్ సూపర్ ఫాస్ట్ రైల్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చేసిన చిన్న తప్పుకు అతి కిరాతకంగా ప్రవర్తించిన మృగాళ్ల రాక్షసత్వం వెలుగులోకి వచ్చింది. అతడు చేసిన చిన్న తప్పుకు అతడిని రైలు కిటికీకి కట్టేశారు. అలా కట్టేసి అతడిని బెల్ట్ లతో చర్మం ఊడేలా కొట్టారు. అక్కడున్న ప్రయాణికులు దీన్ని గమనించి ఆతడిని కిందకు దింపి రక్షించారు.

పాట్నాకు చెందిన సుమిత్ అనే వ్యక్తి ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ నెల 25వ తేది అతడు లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో రాత్రి 11 గంటలకు ఎక్కాడు. అయితే అతడికి దాహం వెయ్యడంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగాడు. అయితే తమను అడగకుండానే నీళ్లు తాగుతావా..? అంటూ ఆ బాటిల్ కు సంబందించిన వ్యక్తులు ప్రశ్నించారు. ఎంత సర్దిచెప్పినా వాళ్లు మాత్రం వినలేదు. తీవ్రంగా తిడుతూ సుమిత్ ను అవమానించారు. అంతటిలో ఆపకుండా తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.


Video Source: Oneindia

చెయిన్ లాగి రైలను ఆపించారు. అలా ఆపగానే.. సుమిత్ ను లోపలి నుండి లాక్కొని వచ్చి.. అతడి రెండు కాళ్లను కిటికీలకు కట్టేశారు. అయితే అతడిని అలా కట్టేసిన తర్వాత రైలు తిరిగి ప్రారంభమైంది. అలా రైలు కదిలి దాదాపుగా నాలుగు గంటలు ప్రయాణించింది. రైలు ఓ స్టేషన్ కు రాగానే ఆ రాక్షసులు రైలు దిగి.. కిటికీకి వేలాడుతున్న సుమిత్ ను తమ బెల్ట్ లతో చివకబాదారు. అక్కడ ఉన్న మిగిలిన ప్రయాణికులు ఏంటని నిలదీయగా..? వారు అక్కడి నుండి తప్పించుకున్నారు. అయితే దీని మీద ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhyapradesh  Train  Sumit  Loksmanya Thilak Super fast Express  

Other Articles