He Beat Me 'Like A Devil', Delhi Model Wrote In Suicide Note

25 year old model priyanka kapoor found hanging husband arrested

delhi murder, delhi model murder, priyanka kapoor murder, husband kills wife, Delhi model, Priyanka kapoor, nitin chawla, ,Dowry,Defence colony suicide, domestic voilence, model soicide domestic voilence

Her sister, Dimpi Kapoor, said the reason behind the “violence” was not clear. “Priyanka told us that her husband had placed a lot of restrictions on her. She was not allowed to meet family and friends,” she said.

గృహహింస తట్టుకోలేక ప్రియాంక ఆత్మహత్య

Posted: 03/28/2016 06:29 PM IST
25 year old model priyanka kapoor found hanging husband arrested

ఢిల్లీ మోడల్ ప్రియాంక కపూర్ (26) ఆత్మహత్య కు పాల్పడింది. తన భర్త చేతిలో అనునిత్యం ఎదురవుతున్న గృహ హింసను తట్టుకోలేక, ఆయన వేధింపుల నుంచి ఉపశమనంగా అమె తన ప్రాణాన్నే తీసుకుంది. తన జీవన శైలిని అడుగడుగున అసహ్యించుకుంటున్న భర్తను, అతడు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి చనిపోయింది. తన భర్త తనను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలని కసురుకున్నాడని  కానీ తాను మాత్రం ప్రపంచాన్నే విడిచిపెట్టి వెళ్లిపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది.

కంపెనీ మేనేజ్ మెంట్ కార్యక్రమానికి అని చెప్పి వెళ్లిన ప్రియాంక ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఏ-46 అనే నెంబర్ గల నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి పెట్టుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి ఆమెను కిందికి దించి ఎయిమ్స్కు తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు రెండు ఆత్మహత్యకు సంబంధించిన లేఖలు దొరికాయి. వీటి ఆధారంగా, ప్రియాంక కుటుంబ సభ్యుల వివరాల ప్రకారంగా పోలీసులు ఆమె భర్త, వ్యాపార వేత్త నితిన్ చావ్లాను అరెస్టు చేశారు. ప్రతిరోజు భార్యను కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా పురికొల్పాడని ఆరోపణలు నమోదుచేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi model  Priyanka kapoor  nitin chawla  

Other Articles