A Handloom weaver message to KTR on about his suicide

A handloom weaver message to ktr on about his suicide

KTR, Telangana, Handloom weaver, Sirisilla

A Handloom weaver in Sirisilla, did a whatsapp message to Telangana Minister KTR about his suicide. He said that he is going to commit suicide.

నేను చనిపోతున్నా అంటూ కేటీఆర్ కు మెసేజ్

Posted: 03/28/2016 11:09 AM IST
A handloom weaver message to ktr on about his suicide

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ సేట్ ల వేధింపులు భరించలేకపోతున్నానను.. దీని కన్నా నేను చనిపోవడమూ బెటర్ అని అనిపిస్తోంది అందుకే చనిపోవాలనుకుంటున్నా... నా భార్యకు , పిల్లలకు తగిని న్యాయం చేయండి. ఆ సేట్ ల నుండి మా లాంటి వాళ్లకు విముక్తి కల్పించండి అంటూ మెసేజ్ లో ఉంది. ఆ మెసేజ్ పెట్టింది ఎవరు అని ఎక్కువగా ఆలోచించకండి.. పెట్టింది ఓ చేనేత కార్మికుడు. అది కూడా సిరిసిల్లకు చెందిన కార్మికుడు. దీని పై వెంటనే స్పందించిన అధికారులు అతడికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

‘‘నేను చనిపోతున్న డబ్బుల కోసం సిరిసిల్లలో వస్త్ర వ్యాపారులు ఎదుటే అజయ్ బాయ్ నన్ను కొట్టి బండ బూతులు తింటాడు. నేను లాస్ అయిన ఇస్తానని చెప్పినా వినలేదు. ఈ చిత్ర హింసకన్నా చనిపోవాలని ఉంది. సిరిసిల్ల సేట్లు, మార్వాడీ సేట్లు బాధిస్తుండ్రు అని నేతన్న తెలిపాడు. రెండు సార్లు చనిపోవాలని వెళ్లాను. నా భార్యా పిల్లలు గుర్తోచ్చి ఊరుకున్నాను. నా వ్యాపారం నడవకుండా నూలు ఇవకండ్రి అని ఆపిండ్రు. దాని వల్ల సాంచాలు బంద్ పడ్డాయి. ఒక నెల లోపు లక్షా రూపాయలు నష్ట పోయా. దయచేసి నా చావుతోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నా….’’ అని మెసేజ్ పెట్టాడు. మొత్తానికి కాసేపు ఈ మెసేజ్ కలకలం రేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Telangana  Handloom weaver  Sirisilla  

Other Articles