BJP MP Beats a old person in Gujarat

Bjp mp beats a old person in gujarat

Gujarat, MP, BJP MP, Vittal Radadiya, Gujarat

The BJP MP Vitthal Radadiya is in controversy for kicking an old man. In a video, surfaced on the social media, the MP from Porbandar constituency of Gujarat is seen repeatedly kicking an old man. However, there was not confirmation about the date and location of the incident, but it appears that the it took place during a religious function as several other devotees are also seen in the video.

ITEMVIDEOS: వృద్దుడిని తన్నిన ఎంపీ

Posted: 03/28/2016 08:30 AM IST
Bjp mp beats a old person in gujarat

పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు గతి తప్పుతున్నరు. ఎలా నడావాలో అన్నదానికి రోల్ మాడల్ గా మారాల్సిన వాళ్లు.... ఎలో ఉండకూడదో అన్న దానికి రోల్ మోడల్ గా మారుతున్నారు. తాజాగా ఓ ఎంపీగారి నిర్వాకం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓ వృద్ధుడిపై కండకావరం ప్రదర్శించాడు ఆ ఎంపీగారు. జనం ముందు ఓ ముసలాయనను పట్టుకొని కాలుతో విచక్షణారహితంగా తన్నాడు. కొట్టొద్దంటూ ఆ వృద్ధుడు వేడుకున్నా వినలేదు. ఆ నాయకుడి పైశాచికం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నది. ఎవరా నాయకుడు..?! గుజరాత్‌లోని పోర్‌బందర్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ విఠల్ రడాడియా రౌడీయిజం ఇది!

ఇటీవల పోర్‌బందర్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలమంది జనం పాల్గొన్నారు. ఎంపీ విఠల్ కూడా హాజరయ్యారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఉన్నట్టుండి ఎంపీ కోపంతో ఊగిపోతూ వేదిక మీది నుంచి కిందికి దిగాడు. జనం మధ్యలో కింద కూర్చున్న ఓ వృద్ధుడి వద్దకు వస్తూ వస్తూనే కుడికాలుతో తన్నడం మొదలుపెట్టాడు. వదిలేయండని ఆ వృద్ధుడు ప్రాధేయపడ్డా.. వినలేదు. గల్లా పట్టుకొని.. అక్కడి నుంచి బయటకు నూకేశాడు. ఆ నాయకుడి దాదాగిరిని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో.. తాను ఎవరినీ తన్నలేదని, కావాలనే తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ విఠల్ రాడియా మీడియాతో అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  MP  BJP MP  Vittal Radadiya  Gujarat  

Other Articles