Team India Great Victory in Worl T20 series

Team india great victory in worl t20 series

Team India, India, World T20, T20, Kohli, Dhoni

In this World T20 India won the match with australia. Indian batsman Virat Kohli extreme batting gave excellent victory to team India.

టీమిండియా గ్రేట్ విక్టరీ.. ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ

Posted: 03/28/2016 05:55 AM IST
Team india great victory in worl t20 series

టీమిండియా సెమీస్ లో చోటుదక్కించుకుుంది. ఆసిస్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీని సాదించింది. భారత గడ్డపై జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత్ అద్వితీయ విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే చేధించింది. విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా జట్టును విజయ తీరాలకు చేర్చాడు

టీమిండియా లక్ష్య ఛేదనలో భాగంగా చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది. 13 రన్ రేట్ ఉంది. పిచ్ కూడా బౌలర్లకు బాగానే సహకరిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కోహ్లీ షో మొదలైంది. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఫాల్కనర్ బౌలింగ్ బంతి అందుకున్నాడు. మొదటి బంతిని డీప్ బ్యాక్ వార్డ్ స్క్వేర్ లెగ్ లో కళ్లు చెదిరే బౌండరీ కొట్టాడు కోహ్లీ. రెండో బంతి స్క్వేర్ డ్రైవ్ తో మరో ఫోర్.. మూడో బంతిని క్రీజును వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆఫ్ లో సిక్సర్ గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతి ఒక రుగు వచ్చింది. ఆరో బంతికి ధోని డబుల్ కొల్లగొట్టాడు. ఈ ఓవర్ లో 19 పరుగులు పిండుకోవడంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. భారత్ 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి ఆసీస్ పైకి వెళ్లింది.

19 ఓవర్ మొదటి బంతి కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించగా డాట్ బాల్ అయ్యింది. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారింది. ఈ తరుణంలో విరాట్ హ్యాట్రిక్ ఫోర్లతో మ్యాచ్ గతిని మార్చాడు. 2వ బంతిని పాయింట్ లో స్వ్కేర్ డ్రైవ్ ద్వారా ఫోర్ కొల్లగొట్టాడు. 3బంతిని ఫైన్ లెగ్ లో బౌండరీ దొరకబుచ్చుకున్నాడు. 4 బంతికి ఎక్స్ ట్రా కవర్ మీదుగా అద్భుత క్రికెటింగ్ షాట్ తో మరో ఫోర్ కొట్టాడు. 5 బంతి డాట్ కాగా.. ఆరో బంతి విరాట్ క్లాసిక్ కవర్ డ్రైవ్ తో బౌండరీని ముద్దాడింది. ఈ ఓవర్లో కోహ్లీ 16 పరుగులు చేశాడు. ఇక చివరి 6 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా. ధోని 20వ ఓవర్ మొదటి బంతిని విన్నింగ్ షాట్ గా బౌండరీకి తరలించాడు. ఈ మ్యాచ్ హీరో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏప్రిల్ 2వ తేదీన టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India  World T20  T20  Kohli  Dhoni  

Other Articles