Suicide bomber targeting Christians kills 65, mostly women and children

Suicide bomber targeting christians kills 65 mostly women and children

Pakistan, Lahore, ester Sunday, christian, Suicide Bomber

A suicide bomber killed at least 65 people, mostly women and children, at a park in Lahore on Sunday in an attack claimed by a Pakistani Taliban faction which said it had targeted Christians.More than 300 other people were wounded, officials said.

నెత్తురోడిన పాకిస్థాన్.. 69 మంది మృతి

Posted: 03/28/2016 06:49 AM IST
Suicide bomber targeting christians kills 65 mostly women and children

పాకిస్థాన్ లో మరోసారి రక్తపాతం జరిగింది. నిన్న జరిగిన ఉగ్రదాడిలో 69 మంది బలికాగా.. దాదాపు 280 మంది గాయాలపాలయ్యారు. లాహోర్ లో నిన్న సాయంత్ర 6.30 నిమిషాలకు ప్రఖ్యాత గుల్షన్ ఏ ఇక్బాల్ పార్కు వద్ద చోటు చేసుకుంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత నగరం లాహోర్‌లో ధనికులు అధికంగా నివసించే ప్రాంతంలో ఈ పార్కు ఉంది. ఈస్టర్ సెలవు నేపథ్యంలో.. పెద్ద సంఖ్యలో పార్కు వద్దకు చేరుకున్న క్రిస్టియన్లతో ఇతర సందర్శకులు లోపలికి వెళ్లేందుకు ప్రధాన గేటు వద్ద వేచి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. జనసమూహంలోని పాకిస్థాన్ తాలిబన్‌కు చెందిన ఆత్మాహుతి ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. క్షణాల వ్యవధిలో 69 మంది శవాలుగా మారగా, చాలా మంది గాయాలతో హాహాకారాలు చేశారు.

గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న భద్రత, వైద్య సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. దాదాపు 23 అంబులెన్సుల్లో క్షతగ్రాత్రులను హాస్పిటళ్లకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆత్మాహుతి సభ్యుడు దాదాపు 8 నుంచి 10 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి ఉండవచ్చునని లాహోర్ డీఐజీ హైదర్ అష్రాఫ్ పేర్కొన్నారు. అయితే క్రిస్టియన్లే లక్ష్యంగా దాడి జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఆత్మాహుతి సభ్యుడి వయస్సు 20 ఏండ్ల వరకు ఉండొచ్చునని అన్నారు. ఈ పార్కువద్ద సాధారణ రోజుల్లోనే జనసందోహం ఎక్కువగానే ఉంటుందని, ఈస్టర్ కావడంతో వారి సంఖ్య మరింతగా పెరిగిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Lahore  ester Sunday  christian  Suicide Bomber  

Other Articles