Maharani's College girls get into fisticuffs over faculty

College turns into a battlefield

Maharani’s Arts, Commerce and Management College, violent clash, two factions of students, Maharani College, Students Fight, Malleswaram, transfer of two professors, College turns battlefield, principal Komala, T.N. Pavitra, H. Kusuma, Shantha Kumari

An issue that had polarised the students of Maharani's College of Arts, Commerce and Management for the last one week, snowballed into a fight that spilled onto the streets

బెంగళూరు మహారాణి విద్యార్థినులే.. ‘సై’ అన్నారు..

Posted: 03/27/2016 05:29 PM IST
College turns into a battlefield

బెంగళూరులోని మహరాణి మహిళా కళాశాలలో ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపోందించిన సై సినిమాను విద్యార్థినులు నిజంగానే ప్రదర్శించారు. విద్యార్థినులు సై చిత్రంలో మాదిరిగి ఘర్షణలకు పాల్పడ్డారు. అయితే అందులో కాలేజ్ గ్రౌండ్ కోసం అయితే. ఇక్కడ మాత్రం లెక్చరర్ వ్యవహారంగా వర్గాలుగా ఏర్పాడ్డారు. అదేంటి విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారా..? ఏంటీ ఇది నిజమే.. అతిశయోక్తిగా లేదు అంటారాా.. అలాంటిదేమీ లేదండి నిజంగా నిజమే.

ప్రఖ్యాత మహారాణి కళాశాల విద్యార్థినులు రెండు జట్లుగా విడిపోయి జుట్లు పట్టుకుని ఆ కళాశాల పరువు తీశారు. ఈ సంఘటన నగర వాసులను నివ్వెరపరిచింది. ఓ లెక్చరర్ బదిలీ విషయమై ఈ రెండు వర్గాల విద్యార్థినులు వీధిలోకి వచ్చి కొట్టుకోవడంతో పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది. పరీక్షల సమయంలో చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు జుట్లుజుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాణి కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ బదిలీ విషయం పై   కొన్ని రోజులుగా మహారాణి కళాశాల విద్యార్థినులు పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ బదిలీని నిలిపేయాలని కొందరు విద్యార్థినులు డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రొఫెసర్ బదిలీ సబబేనని మరికొంత మంది విద్యార్థినులు చెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఉన్నట్టుండి ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఇదే విషయంపై చర్చకు దిగారు. ఈ చర్చ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు విభాగాల విద్యార్థినుల మధ్య గొడవకు దారి తీసింది. పోలీసులు అడ్డుపడి వారిని విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharani College  Students Fight  Malleswaram  

Other Articles