India beats Bangladesh by 1 run

India beats bangladesh by 1 run

Tean India, India, balgladesh, T20 , T20 World Cup

India’s much vaunted batting line-up struggled on a slow and sluggish track as they managed an unimpressive 146/7 against a disciplined Bangladesh attack in a group league encounter of the ICC World Twenty20, on Wednesday.

ఒక్క రన్ తో టీమిండియా గెలుపు.. చివరి దాకా నరాలు తెగే టెన్షన్

Posted: 03/24/2016 05:56 AM IST
India beats bangladesh by 1 run

వరల్డ్ కప్ మజాను టీమిండియాకు రుచిచూపించింది బంగ్లాదేశ్. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చివరి బాల్ వరకు అభిమానులకు, ఆటగాళ్లకు నరాలు తెగే ఉత్కంఠన నెలకొంది. బంతి బంతికి అందరికి బిపి రైజ్ అయింది. పసి కూనే అని అనుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియాకు చుక్కలు చూపించినా...ఆట మజాను అందించారు. నెట్ రన్ రేట్ పెంచుకోవాల్సిన మ్యాచ్ లో రన్ రేట్ మాట దేవుడెరుగు.. అసలు గెలవడానికే నానా కష్టాలు పడ్డారు. బాల్ బాల్ రే మారుతున్న ఈక్వెషన్స్.. గెలుపెవరిని వరిస్తుందో తెలియని టెన్షన్.. మొత్తం మీద భారత్ గెలిచింది. కాదు అదృష్టం గెలిపించింది.

మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు దూకుడుగా ఆడినట్టు కనిపించారు. ధావన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించారు. కానీ వెంటవెంటనే ఔట్ కావడంతో.. టిమిండియా డిఫెన్స్ లో పడిపోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడితే.. రైనా దూకుడుగా ఆడాడు. కానీ వీళ్లిద్దరూ కూడా వెంట వెంటనే ఔట్ అయ్యారు. మెరుపులా వచ్చిన వెంటనే సిక్స్ కొట్టిన హార్ధిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో బంగ్లాదేశ్ అద్భుతమైన ఫీల్డింగ్ కు పెవిలియన్ చేరాడు. యువరాజ్ పూర్తిగా నిరాశపర్చాడు. ధోనీ, చివరకు అశ్విన్ అండతో వికెట్ పోకుండా నిలబెట్టగలిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లు రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది.

బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కు మొదట్లోనే దెబ్బ తగిలింది. మహ్మద్ మిథున్ అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షబ్బీర్ రెహ్మాన్ అండతో ఇక్బాల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 11 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పొయిన బంగ్లాదేశ్.. రెండో వికెట్ 55 పరుగుల వద్ద కోల్పోయింది. తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. ఒక దవలో 95 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలుపు ఈజీ అనుకున్నారంతా. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.

అద్భుతంగా పోరాడిన బంగ్లాదేశ్ టెయిలెండర్లు.. భారత్ కు చుక్కలు చూపించారు. చివరి 3 ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన సమయంలో సంయమనంతో ఆడి విజయం దిశగా దూసుకెళ్లారు. ఫలితంగా చివరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే బంగ్లాదేశ్ చితకబాదిన పాండ్యాకు బాల్ ఇచ్చాడు కెప్టెర్ ధోనీ.. మొదటి మూడు బంతుల్లో 2 ఫోర్లు కొట్టిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ తర్వాతి రెండు బంతుల్లో 2 వికెట్లు పడడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ కెప్టెన్ ధోనీ వ్యూహంలో అనుభవం లేని బంగ్లా చిక్కుకుంది. చివరకు భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠకు నైస్ కంక్లూజన్ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tean India  India  balgladesh  T20  T20 World Cup  

Other Articles