Minor raped in Muzaffarnagar; accused also filmed the act, now absconding

Youth rapes minor and absconds films act

Uttar pradesh, muzaffar nagar, minor raped in muzaffar nagar, family supports son rape minor, Sujru village, Zahid, Nadeem, Afsana, Ikram, Kamil, Sarvari, rape, rape, minor girl raped, muzafar nagar, uttar pradesh, crime news, molestation on women, attrocities on women, harrassment on women

A 17-year-old girl was allegedly raped by a youth who filmed the act in Purkazi town here, police said on Wednesday.

దారుణం: ఈ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసినా తప్పులేదు..

Posted: 03/23/2016 05:18 PM IST
Youth rapes minor and absconds films act

పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహము కాదు పెరిగి పెద్దైన తరువాత ఆ పుత్రుడు మంచి పేరు తీసుకువస్తేనే అప్పుడే పుత్రోత్సాహము అన్న అర్ధాన్ని కూడా మార్చివేశారు ఆ కుటుంబ సభ్యులు, తమ పుత్రుడు తమ ముందే తమ కుటుంబానికి తలవంపులు తీసుకువస్తుంటే.. అంతా కలసి సహకరించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఈ కుటుంబం మొత్తం ఓ అభాగిని అత్యాచారానికి గురికావడానికి కారణమైంది. నిందితుడి సోదరి బాధితురాలిని ఇంటికి తీసుకురాగా, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని పుర్కాజీ పట్టణంలో ఈ దారుణ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు.

బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు.. ఇటీవల ఆమె (17)ను నదీమ్ (25) అనే యువకుడి సోదరి అఫ్సానా వారి ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆఫ్సానా ఇంట్లో నదీమ్, తల్లిదండ్రులు శార్వరి, ఇక్రామ్, బంధువు కమిల్ ఉన్నారు. వీరందరూ ఉండగానే నదీమ్ బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

ముజఫర్నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడు నదీమ్తో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నదీమ్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే జరిగిన మరో ఘటనలో జాహిద్ (30) అనే వ్యక్తి.. ఓ మహిళను ఆమె ఇంట్లోనే అత్యాచారం చేశాడు. కాగా కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం చేసిన కుటుంబాన్ని వెలివేసినా తప్పులేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  minor girl raped  muzafar nagar  uttar pradesh  crime news  

Other Articles