JP cant change polictis so retire from politics

Jp cant change polictis so retire from politics

JP, LokSatta, LokSatta Party, Jayaprakash narayan, Negabhirava jayaPrakash narayan, Quit from Politics

Lok Satta party founder and president Dr Jayaprakash Narayan is all set to quit politics. While he is yet to make an official announcement, Jayaprakash Narayan revealed to the media that he leaving out the responsibility to few others in the party.

మార్పు చేతకాక రాజకీయాల నుండి తప్పుకున్న అపజయ ప్రకాశ్

Posted: 03/23/2016 04:42 PM IST
Jp cant change polictis so retire from politics

డాక్టర్ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ అంటే చాలా మందికి మంచి గౌరవం ఉంది. ఓ మేదావి తన వరకు మాత్రమే ఆలోచించకుండా సమాజం కోసం ఆలోచిస్తే ఎంత మార్పు వస్తుందో నిరూపించిన విజేత. కానీ తాజాగా ఆయన ఓ నిర్ణయం ఎవరికీ అర్థంకాలేదు. లోక్ సత్తా పార్టీ స్థాపకుడిగా తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని. కేవలం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గా మాత్రమే తన లోక్ సత్తాను కొనసాగిస్తానని ప్రకటించారు. నిజానికి ఆయన ఓ రకంగా ఓడిపోయాడనే చెప్పాలి.. కానీ ఇక్కడ జెపితో పాటు ఎంతో మంది నమ్మకాన్ని కూడా ఆయన ఓడించారు. తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోతే దాని ప్రభావం ఎంతో మందిపై, ఎంతో కాలం ఉంటుంది. జీవితంలో ఎన్నడూ ఓటమిని ఎరుగని సాహసి.. నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు.. ఎంతో మందిలో ఎక్కడో ఉన్న చిన్న ఆశను కూడా చిదిమేశాడు.

జెపి రాజకీయాల నుండి తప్పుకున్న దాని మీద నేను రాస్తున్న ఈ ఆర్టికల్ కొంత మందికి నచ్చొచ్చు.. కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ నా వరకు కొన్ని నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1996 లో ఓ నాన్ గవర్నయమెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించిన జెపి తర్వాత 2009 అక్టోబర్ 2న లోక్ సత్తా పేరుతో పూర్తి స్థాయి రాజకీయ పార్టీకి అంకురార్పణ చేశాడు. 2009 నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన లోక్ సత్తా పార్టీకి అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ప్రజల్లో చైతన్యానికి ఎంతో కృషి చేసినా, రాజకీయ వాతావరణం కారణంగా ప్రజల్లో మార్పును ఓట్లుగా పోగెయ్యలేకపోయారు జెపి.

1980లో ఐఏఎస్ గా ఆల్ ఇండియాలోనే 5 ర్యాంక్ సాధించిన జెపి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. తాను ఎక్కడ పని చేస్తే అక్కడ రైతులకు, నిరుద్దోగులకు, పేదలకు మంచి చేశాడు. తర్వాత రాజకీయంగా మార్పు వస్తే మొత్తం వ్యవస్థ మారుతుందని.. ఆ వ్యవస్థ మారితే ప్రజల జీవన విధానం కూడా మారుతుందని గట్టి నమ్మకంతో పార్టీని స్థాపించారు. మరి అంత నమ్మకం పార్టీని స్థాపించిన టైంలో జెపికి ఉన్నా.. తర్వాత ఎందుకు తగ్గింది అనే దాన్ని ఎవరూ కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఎవరికీ అది అవసరం లేదు. కానీ జెపి వల్ల ఎంత మంది భవితవ్యం డైలమాలో పడిందో ఆలోచిస్తున్నారు.

జెపి పార్టీ పెట్టిన తర్వాత ఆయన లాగే ఆలోచించే కొంత మంది మేధావులు ఆయన పక్కన చేరారు( అలాగని లోక్ సత్తా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మేధావులు అని చెప్పడం లేదు). మేధావులు అంతా ఎన్నికలకు సిద్దం కాగా.. వారి జెండా ఒక్కటే నిజాయితీగా పని చెయ్యాలి.. ప్రజలకు మేలు చెయ్యాలి. కానీ అది కుదరలేదు. జెపి లాంటి మేధావి కూడా రాజకీయ రణరంగంలో అస్త్ర సన్యాసం చేసి.. యుద్ద రంగం నుండి వెనుదిరిగాడు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు.

కష్టాలు వస్తే రానీ. వస్తే రానీ.. సుతుల్. హితులు పోతే. పోనీ. పోతే పోనీ అని ఓ లైన్ గుర్తుకు వచ్చింది. తాము నడిచే దారిలో ముళ్లున్నా కానీ వాటిని తొక్కుతూ ముందు తరాలకు బాటలు వెయ్యాలి. అలా రాజకీయంగా నీతివంతమైన, నిస్వార్థమైన బాటలు వేస్తాడు అనుకుంటే మధ్యలోనే నావను వదిలేసి వెళ్లిపోయాడు. జెపి నిర్ణయం తప్పా కరెక్టా అన్నది కాదు.. ఎంత మంది ఆశలను ఆయన ఆవిరి చేశాడు.. ఎంత మంది నమ్మకాన్ని వమ్ము చేశాడు అన్నది పాయింట్.

ఓటమి చవిచూడని జీవితాన్ని దేవుడు ఎవరికి ప్రసాదించలేదు. కానీ ఆ ఓటమితో వెనుదిరిగితే మాత్రం విజయం ఎన్నటికీ మన దరికి చేరదు. మరి జెపి లాంటి విజేత రాజకీయాల్లో మాత్రం ఎందుకు పరాజితుడిగా నిలిచాడు అన్నది కూడా చూడాలి. మార్పు సాధ్యం కావాలంటే ఒక్కడి వల్ల కాదు. కానీ జయప్రకాశ్ మాత్రం ఒంటరిగా పోరాడారు. అందరూ కూడా జెపిని మెచ్చుకొనే వాళ్లే కానీ మనస్పూర్తిగా ఆయనకు మద్దతునిచ్చి జెపి కృషిలో పాలుపంచుకుందాం అనే ఆలోచన లేదు. ఇక డబ్బులే రాజకీయాలను నడిపిస్తున్న తరుణంలో జెపి లాంటి వ్యక్తి నీతితో బ్రతకండి.. నిజాయితీగా ఓటు వెయ్యండి అంటే పట్టించుకునే నాధేడు లేదు.


వెలుగు లేదని చీకటిలోనే స్థిరపడిపోతావా..
చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోతావా..
ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగువేస్తావా..
నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోలేవా..
అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోవా.


-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles