After PM Modi, it's Kejriwal's turn to enter Madame Tussauds

Not just pm modi arvind kejriwal at madame tussauds too

Arvind Kejriwal, Madame Tussauds museum, Indian actors, big B Amitab bachchan, shahrukh khan, Delhi Chief Minister, narendra modi,

A team of artists working at the Madame Tussauds museum in London will visit Delhi next month to get measurements of Kejriwal for his wax statue that will be on display at India's first wax museum coming up at Connaught Place by 2017.

ప్రధాని నరేంద్రమోడీ సరసన చేరనున్న అరవింద్ కేజ్రీవాల్

Posted: 03/21/2016 08:42 PM IST
Not just pm modi arvind kejriwal at madame tussauds too

ఆమ్ ఆద్మీ అద్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుల స్వరం వినిసిస్తూ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. సామాన్యుల కోసం పోరాడే చాంపియన్ గా కేజ్రీవాల్ ను ఆయన అభిమానులు కీర్తిస్తారు. కాగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వున్నారు. తన మంత్రులు, నేతలను టార్గెట్ చేసి కేంద్రం ఇబ్బందులను సృష్టిస్తుందని మండిపడటం కొత్తేమి కాదు. అయితే ఆయన నిత్యం విమర్శలు గుప్పించే ప్రధాని మోడీ సరసన త్వరలోనే చేరబోతున్నారుజ.

అదేంటి ఇంత విమర్శలు గుప్పించే నేత అయన సరసన చేరుతున్నారని అలోచిస్తున్నారా..? ఇంతకీ ఏమిటీ రహస్యం అనుకుంటున్నారా..? మోడీ సరసన చేరేది లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో.. వీవీఐపీల సరసన నిలువబోతున్నారు. ఇప్పటికే మేడం టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మలుగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలో చేరనుంది.

అచ్చం మోదీలా రూపురేఖలు, హవాభావాలున్న ఈ మైనపు బొమ్మకు ఇటీవల తుది మెరుగులు దిద్దుతూ దింపిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. నిజంగా మోదీనే చూస్తున్న భావన కల్పించాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలోకి చేరనుంది. అచ్చం తనలాగే ఉండే ఈ బొమ్మ రూపకల్పన కోసం కొలతలు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఒప్పుకొన్నారని, వచ్చేనెలలో కొలతలు తీసుకుంటారని కేజ్రీవాల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Madame Tussauds museum  Delhi Chief Minister  narendra modi  

Other Articles