Jagan siad chandrababu Naidu dont have two qualities

Jagan siad chandrababu naidu dont have two qualities

ap, jagan, Chandrababu Naidu, Assembly, YS Jagan

Jagan siad chandrababu Naidu dont have two qualities. He said chandrababu did not have character and credibility. people not beliveing chandrababu naidu.

ITEMVIDEOS: చంద్రబాబుకు ఆ రెండు లేవా..?

Posted: 03/19/2016 04:09 PM IST
Jagan siad chandrababu naidu dont have two qualities

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకే కాదు ఏ నాయకుడికైనా కావాల్సింది రెండు లక్షణాలు అని జగన్ అన్నారు. చట్టసభ కోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడం బాధాకరం. రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. యునానిమస్ గా రోజాను సభ సస్పెండ్ చేశారు అని స్పీకర్ ప్రకటించారు. కానీ రూల్స్ లో లేకపోయినా అబద్దాలు చెబుతున్నారు. రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం మీద నిరసన తెలిపేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. రోజా సస్పెన్షన్ విషయంలో స్పీకర్ అబద్దాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. న్యాయస్థానం తీర్పులను కూడా గౌరవించలేని పరిస్థితి నెలకొంది.  సభను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షనాయకుడు జగన్ వెల్లడించారు.

చంద్రబాబుకు లేని రెండు ఏంటంటే...
క్యారెక్టర్(వ్యక్తిత్వం)- అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీఆర్ ను హత్య చేయడం ఆయన క్యారెక్టర్ అని జగన్ ఆరోపించారు.
క్రెడిడిలిటి(విశ్వసనీయత)- ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్దాలు చెప్పడం. ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చెయ్యడం అని జగన్ అన్నారు.

ఈ రెండూ ఆయనకు లేవు కాబట్టే ప్రజల్లోకి వెళ్లలేక లంచాలతో సంపాదించిన డబ్బుతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్ అన్నారు.  సిగ్గు, రోషం, లజ్జ ఏమాత్రం ఉన్నా ఆ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయండి. ఎన్నికల ద్వారా ప్రజల్లోకి వెలదాం.. చూద్దాం అని జగన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  jagan  Chandrababu Naidu  Assembly  YS Jagan  

Other Articles