Anupam Kher takes on Kanhaiya Kumar in JNU: How can you make a hero out of someone on bail?

Actor anupam kher lectures jnu on patriotism targets kanhaiya kumar

Anupam Kher, Buddha in a traffic jam, JNU row, Kanhaiya Kumar, Umar Khalid, Anirban Bhattacharya

Anupam Kher, who was at the Jawaharlal Nehru University for the screening of his film, Buddha in a traffic jam, further said someone who has returned on bail is not an Olympic hero.

అనుఫమ్ ఖేర్ ఒలంపిక్ హీరోల వ్యాఖ్యలపై కన్హయ్య కౌంటర్

Posted: 03/19/2016 01:40 PM IST
Actor anupam kher lectures jnu on patriotism targets kanhaiya kumar

జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్యూ) ఘటనకు సంబంధించి బెయిల్ పై విడుదలైన విద్యార్థులు ఒలింపిక్ హీరోలేమీ కాదని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం ఆయన ‘బుద్ధా స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్’ సినిమా స్క్రీనింగ్ నిమిత్తం జేఎన్యూ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో బెయిల్ పై విడుదలైన వారికి క్యాంపస్ విద్యార్థులు స్వాగతం పలుకవద్దని  సూచించారు. తిరుగుబాటు తత్వం నుంచి బయటపడి దేశభక్తిని అలవర్చుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

జేఎన్యూ ఘటనలో విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిల్ భట్టాచార్య లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం అనుపమ్ ఖేర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ సహా, మరికొంత మంది మద్దతుదారులు ఈ రోజు రాత్రి క్యాంపస్ లో యూనిటీ మార్చ్ నిర్వహించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న అనుపమ్ ఖేర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ స్పందించాడు.

జేఎన్యూ విశ్వవిద్యాలయంలోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వస్తున్నారని, అయితే ఆయనను అడ్డుకోవాలని పలువురు తన వద్దకు ప్రస్తావన తీసుకువచ్చారని, కానీ జేఎన్యూ డిబేట్ లను స్వాగతిస్తుంది. వ్యక్తుల వాక్ స్వేచ్ఛను హరించదని బయటి ప్రపంచానికి తెలియజేయడానికే తాము అడ్డుకోలేదన్నారు.  కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ దేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగమని, కాశ్మీరీలు భారతీయులైనప్పుడు వారు ఎదుర్కోంటున్న పలు అంశాలను మనం చర్చించడంలో తప్పేముందని ప్రశ్నించాడు.

దేశద్రోహం కింద అభియోగాలతో జైలుకెళ్లి వచ్చిన కన్హయ్య.. తాను కాశ్మీర్ తీవ్రవాది అప్జల్ గురు ఉరిశిక్షకు వ్యతిరేకంగా నినదించామన్నారు. దేశంలో తాము క్యాపిటల్ పనిష్ మెంట్ అయిన ఉరిశిక్షను మాత్రమే వ్యతిరేకించామని, అప్జట్ గురు తీవ్రవాదికి అనుకూలంగా నిరసనలు చేపట్టలేదని అన్నారు. ఫ్రిబవరి 9న ఉరిశిక్ష విధించడాన్ని తాము వ్యతిరేకించామన్నారు. అప్జల్ గురు స్థానంలో ఏబివీఫీ కార్యకర్త వున్నా తాము ఉరిశిక్షను వ్యతిరేకించేవారనమని కన్హయ్య అన్నారు. ఇదిలావుండగా, తన ప్రసంగం నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థులు భారత్ మాతకీ జై అంటూ, వందే మాతరం అంటూ ఇచ్చిన నినాదాలతో అక్కడ అలుముకున్న దేవ వ్యతిరేక వాతావరణం పోయిందని, ఇప్పుడు పావనమైందని అనుఫమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles